బాధ ప‌డొద్దు.. నీకు తోడుగా ఉంటాం: సీఎం కేసీఆర్  

ప్ర‌త్యూషా నీకు ఎవ‌రూ లేర‌ని బాధ ప‌డొద్దు. మేమంద‌రం నీకు తోడుగా ఉన్నాం. ఆస్పత్రి నుంచి నేరుగా మా ఇంటికి తీసుకెళ్లి ప‌దిరోజులు ఉంచుకుంటాం. ఆ త‌ర్వాత  మంచి హాస్ట‌ల్లో ఉంచి నీకిష్ట‌మైన చ‌దువు చెప్పించ‌డంతో పాటు నీపెళ్లిని కూడా నా సొంత ఖ‌ర్చుల‌తో జ‌రిపిస్తాన‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. క‌న్న‌తండ్రి, స‌వ‌తి త‌ల్లి చేతిలో చిత్ర‌హింస‌ల‌కు గురై స‌రూర్ న‌గ‌ర్లోని  ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్ర పొందుతున్న బాలిక ప్ర‌త్యూష‌ను సీఎం కేసీఆర్‌, త‌న […]

Advertisement
Update:2015-07-18 18:41 IST

ప్ర‌త్యూషా నీకు ఎవ‌రూ లేర‌ని బాధ ప‌డొద్దు. మేమంద‌రం నీకు తోడుగా ఉన్నాం. ఆస్పత్రి నుంచి నేరుగా మా ఇంటికి తీసుకెళ్లి ప‌దిరోజులు ఉంచుకుంటాం. ఆ త‌ర్వాత మంచి హాస్ట‌ల్లో ఉంచి నీకిష్ట‌మైన చ‌దువు చెప్పించ‌డంతో పాటు నీపెళ్లిని కూడా నా సొంత ఖ‌ర్చుల‌తో జ‌రిపిస్తాన‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. క‌న్న‌తండ్రి, స‌వ‌తి త‌ల్లి చేతిలో చిత్ర‌హింస‌ల‌కు గురై స‌రూర్ న‌గ‌ర్లోని ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్ర పొందుతున్న బాలిక ప్ర‌త్యూష‌ను సీఎం కేసీఆర్‌, త‌న భార్య, కుమార్తె ఎంపి క‌విత‌తో పాటు మ‌రో ఎంపి సుమ‌న్‌తో క‌లిసి శ‌నివారం ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, నువ్వు బాగా చ‌దువుకుని ఆర్థికంగా స్థిర ప‌డి, బాధ‌ల్లో ఉన్న వారిని ఆదుకోవాల‌ని అన్నారు. ప్ర‌త్యూష‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. మెరుగైన వైద్యం అందిచాల‌ని డాక్ట‌ర్ల‌కు సూచించారు. ప్ర‌త్యూష పూర్తిగా కోలుకున్న త‌ర్వాతే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేయాల‌ని సీఎం చెప్పారు.​

Tags:    
Advertisement

Similar News