ప్రజా వ్యతిరేకం గ్రీస్ నిర్ణయం: కారత్
యూరో జోన్, ఐఎంఎఫ్ బాస్‌లకు తలొగ్గి ప్రజలపై సంస్కరణల భారాన్ని మోపుతూ ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ తన దేశ ప్రజలకు ద్రోహం చేశారని సిపిఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. ఇది గ్రీస్ ప్రజలకు అత్యంత విషాదకరమైన ఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ సార్వభౌమత్వం ప్రభుత్వం చేతుల్లో భద్రంగా ఉంటుందని గ్రీస్ ప్రజల నమ్మకాన్ని సిప్రాస్ నేతృత్వంలోని సిరిజా ప్రభుత్వం అత్యంత క్రూరంగా చిదిమేసిందని ఆయన వ్యాఖ్యానించారు. […]
Advertisement
యూరో జోన్, ఐఎంఎఫ్ బాస్‌లకు తలొగ్గి ప్రజలపై సంస్కరణల భారాన్ని మోపుతూ ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ తన దేశ ప్రజలకు ద్రోహం చేశారని సిపిఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. ఇది గ్రీస్ ప్రజలకు అత్యంత విషాదకరమైన ఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ సార్వభౌమత్వం ప్రభుత్వం చేతుల్లో భద్రంగా ఉంటుందని గ్రీస్ ప్రజల నమ్మకాన్ని సిప్రాస్ నేతృత్వంలోని సిరిజా ప్రభుత్వం అత్యంత క్రూరంగా చిదిమేసిందని ఆయన వ్యాఖ్యానించారు. రుణభారం నుండి బయటపడేందుకు, తాజా రుణ సదుపాయం అందుకునేందుకు ఐరోపా త్రయం విధించిన రాక్షస షరతులపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ సిప్రాస్ ప్రభుత్వం ఈ నెల 5న నిర్వహించిన రిఫరెండంలో 61.3 శాతం మంది ప్రజలు ‘నో’ అంటూ తమ అభిప్రాయాన్ని ముక్తకంఠంతో వినిపించినా ఇందుకు వ్యతిరేకంగా సిప్రాన్ నిర్ణయం తీసుకోవడానికి ప్రకాశ్ కారత్ తప్పుపట్టారు.
Advertisement