ప్లూటో చంద్రుని చిత్రాల విడుదల

ప్లూటో (యమ) గ్రహానికి చెందిన అతిపెద్ద చంద్రుడు చరాన్‌కు సంబంధించిన చిత్రాలను అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా విడుదల చేసింది. దాని ఉత్తర ధ్రువం వద్ద పూర్తి చీకటిగా ఉండడాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంతానికి శాస్త్రవేత్తలు ‘మోర్డార్‌’ అని పేరు పెట్టారు. ఈ ప్రయోగానికి సంబంధించిన అత్యున్నత ప్లానెటరీ శాస్త్రవేత్త కేథీ ఓల్‌కిన్‌ చరాన్‌ ఉత్తర ధ్రువంపై చూస్తున్న అతి చిక్కటి చీకటిగా ఉన్న ఈ ప్రాంతాన్ని అనధికారికంగా మోర్డార్‌ అని పిలుస్తారని చెప్పారు. జూలై 13న […]

Advertisement
Update:2015-07-17 19:01 IST
ప్లూటో (యమ) గ్రహానికి చెందిన అతిపెద్ద చంద్రుడు చరాన్‌కు సంబంధించిన చిత్రాలను అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా విడుదల చేసింది. దాని ఉత్తర ధ్రువం వద్ద పూర్తి చీకటిగా ఉండడాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంతానికి శాస్త్రవేత్తలు ‘మోర్డార్‌’ అని పేరు పెట్టారు. ఈ ప్రయోగానికి సంబంధించిన అత్యున్నత ప్లానెటరీ శాస్త్రవేత్త కేథీ ఓల్‌కిన్‌ చరాన్‌ ఉత్తర ధ్రువంపై చూస్తున్న అతి చిక్కటి చీకటిగా ఉన్న ఈ ప్రాంతాన్ని అనధికారికంగా మోర్డార్‌ అని పిలుస్తారని చెప్పారు. జూలై 13న 4,66,000 కిలోమీటర్ల దూరం నుంచి ఈ మోర్డార్‌ ఫోటోను నాసాకు చెందిన హారిజాన్స్‌ అంతరిక్ష కృత్రి ఉపగ్రహం తీసింది. సుమారు 1,000 కిలోమీటర్ల మేర కొండలు, గుట్టలు దానిపై ఉన్నట్లు ఈ చిత్రం ద్వారా తెలుస్తోంది. చరాన్‌ పైభాగంలో ఏడు నుంచి తొమ్మిది కిలోమీటర్ల మేర లోతైన లోయ ఆ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. చరాన్‌పై బిలాలు లేకపోవడంపై శాస్త్రజ్ఞులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Tags:    
Advertisement

Similar News