తెలంగాణలో కనపడని బంద్ ప్రభావం
మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు ఇచ్చిన బంద్‌కు ప్రజల నుంచి స్పందన కరువైంది. దీంతో బంద్ ప్రభావం పెద్దగా కనపడలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ బస్సులు యధావిధిగా నడిచాయి. పెట్రోలు బంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు కాసేపు బంద్ పాటించినా తర్వాత యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించాయి. పాఠశాలలు, బ్యాంకులను మాత్రం మూసి వేశారు. వామపక్షాల బంద్‌కు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీతో సహా విద్యార్ధి సంఘాలు, యువజన సంఘాలు […]
Advertisement
మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు ఇచ్చిన బంద్‌కు ప్రజల నుంచి స్పందన కరువైంది. దీంతో బంద్ ప్రభావం పెద్దగా కనపడలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ బస్సులు యధావిధిగా నడిచాయి. పెట్రోలు బంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు కాసేపు బంద్ పాటించినా తర్వాత యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించాయి. పాఠశాలలు, బ్యాంకులను మాత్రం మూసి వేశారు. వామపక్షాల బంద్‌కు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీతో సహా విద్యార్ధి సంఘాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నాయి. కాంగ్రెస్ యువజన నేతలు పలు చోట్ల బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ప్రతి డిపో ముందు వామపక్ష కార్యకర్తలు, ప్రతిపక్ష నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. అయితే, ప్రజల నుంచి స్పందన కరువవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రభావం పాక్షికంగా కనపడింది.
Advertisement