బంద్ విజ‌య‌వంతం చేయండి: రాజ‌కీయ పార్టీల పిలుపు

తెలంగాణలో మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేర బంద్‌కు కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీలు మద్ధతు పలికాయి.ఎంజీబీఎస్‌ ఎదుట వామపక్షాల కార్యకర్తలు ధర్నా చేశారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకొని నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి వామపక్షాల కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కే సీఆర్‌ నియంతృత్వ ధోరణి విడనాడాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల పట్ల కేసీఆర్‌ పాశవికంగా ప్రవర్తిస్తున్నారని సీపీఎం నేత […]

Advertisement
Update:2015-07-16 18:49 IST
తెలంగాణలో మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేర బంద్‌కు కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీలు మద్ధతు పలికాయి.ఎంజీబీఎస్‌ ఎదుట వామపక్షాల కార్యకర్తలు ధర్నా చేశారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకొని నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి వామపక్షాల కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కే సీఆర్‌ నియంతృత్వ ధోరణి విడనాడాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల పట్ల కేసీఆర్‌ పాశవికంగా ప్రవర్తిస్తున్నారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. నాగర్‌కర్నూలు, వనపర్తి, కల్వకుర్తి బస్‌డిపోల ఎదుట వామపక్షాల కార్యకర్తలు ధర్నా చేశారు. ఖమ్మం, కరీంనగర్‌ ఆర్టీసీ డిపోల వద్ద కార్యకర్తలు ధర్నా చేశారు. సిద్ధిపేట, సంగారెడ్డి, గజ్వేల్‌ డిపోల ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోదాడలో మున్సిపల్‌ కార్మికులు డిపో ఎదుట బైఠాయించారు. హన్మకొండ, నల్గొండ డిపోల ఎదుట కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
జీహెచ్ఎంసీ కార్మికుల డిమాండ్ల సాధ‌నే ల‌క్ష్యం
గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఉద్యోగులు, కార్మికుల శుక్ర‌వారం చేయ‌త‌ల‌పెట్టిన స‌మ్మెకు రాజ‌కీయ పార్టీల‌న్నీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి బంద్‌ విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చాయి. రోడ్ల వెంబ‌డి తిరుగుతూ వీధుల‌ను శుభ్రం చేసే కార్మికుల క‌నీస అవ‌స‌రాలు తీర్చ‌లేని కేసీఆర్ ప్ర‌భుత్వ వైఖ‌రిని అన్ని పార్టీలు దుయ్య‌బ‌ట్టాయి. కార్మికుల డిమాండ్లు నెర‌వేరే వ‌ర‌కు ప్ర‌భుత్వంపై పోరాటం సాగించాల‌ని పిలుపు ఇచ్చాయి. జీహెచ్ఎంసీ కార్మికుల బంద్‌కు త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దీనికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా మ‌ద్ద‌తు తెలిపింది. ఎమ్మెల్యేలు, జెడ్పీల జీతాలు పెంచిన కేసీఆర్ జీహెచ్ఎంసీ కార్మికులు జీతాలు ఎందుకు పెంచ‌డం లేద‌ని టీ-టీడీపీ నాయ‌కుడు పెద్దిరెడ్డి ప్ర‌శ్నించారు. ఈరోజు జరుగుతున్న బంద్‌కు త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇక ముందునుంచీ వామ‌ప‌క్షాలు జీహెచ్ఎంసీ కార్మికుల డిమాండుకు అండ‌గానే నిల‌బ‌డ్దాయి. ఈ బంద్‌ను అంద‌రూ విజ‌యవంతం చేసి టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాల‌ని కోరాయి. సీపీఎం, సీపీఐ, న్యూ డెమక్ర‌సీ పార్టీలు కార్మికుల డిమాండు నెర‌వేరే వ‌ర‌కు అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించాయి. జీహెచ్ఎంసీ కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా బీజేపీ సభ నిర్వహించి టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతూ పేద‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, పారిశుధ్య కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా ప్ర‌భుత్వం ప‌ట్టింపులకు పోతోంద‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. వైసీపీ కూడా ఈరోజు జరుగుతున్న బంద్‌కు మద్దతు తెలిపింది.
Tags:    
Advertisement

Similar News