శివసేన,బీజేపీల మధ్య ముదిరిన వివాదం
శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే, బీజేపీ ముంబై నగర అధ్యక్షుడు ఆశిష్ షెలార్ల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఉద్దవ్ కార్యకలాపాలను షెలార్ తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఆరంభమైంది. ఆశిష్‌కు వ్యతిరేకంగా పని చేయాలని శివసేన శాసనసభ్యులు తమ పార్టీ కార్యకర్తలకు ఉద్భోదించారు. ముంబైలోని విద్యాన్ భవన్లో గురువారం జరిగిన సమావేశంలో శివససేన సీనియర్ నేత సుభాష్ దేశాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక అనామక నేత మన నాయకుడిని […]
Advertisement
శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే, బీజేపీ ముంబై నగర అధ్యక్షుడు ఆశిష్ షెలార్ల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఉద్దవ్ కార్యకలాపాలను షెలార్ తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఆరంభమైంది. ఆశిష్‌కు వ్యతిరేకంగా పని చేయాలని శివసేన శాసనసభ్యులు తమ పార్టీ కార్యకర్తలకు ఉద్భోదించారు. ముంబైలోని విద్యాన్ భవన్లో గురువారం జరిగిన సమావేశంలో శివససేన సీనియర్ నేత సుభాష్ దేశాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక అనామక నేత మన నాయకుడిని విమర్శించడాన్ని మనం సహించగలమా, అతనికి వ్యతిరేకంగా పని చేద్దాం, మననేతపై విమర్శలు చేసిన వారిని విడిచి పెట్టొద్దని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement