కోరంగి కంపెనీ భూముల్లో ఎర్ర‌జెండాలు

పేద‌ల‌కు భూములు పంచిన సీపీఎం భూస్వాముల క‌బంధ హ‌స్తాల‌లో చిక్కుకున్న భూముల‌కు ఎట్ట‌కేల‌కు విముక్తి ల‌భించింది. క‌ష్ట‌జీవుల ప‌ర‌మ‌య్యాయి.  తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు కోరంగి కంపెనీ భూముల్లో పోలెకుర్రు పంచాయతీకి చెందిన పేదలు గురువారం నాడు వ్యవసాయ ప‌నులు ప్రారంభించారు. వాస్త‌వానికి ఈనెల 13నే కోరంగి కంపెనీ భూములను సిపిఎం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి పేదలు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుపేట, జైభీమ్‌పేట, జార్జిపేట, తూర్పుపేట బిసి కాలనీ, ఎస్‌సి కాలనీలకు చెందిన సుమారు 200 మంది పేద‌లు […]

Advertisement
Update:2015-07-17 06:03 IST
పేద‌ల‌కు భూములు పంచిన సీపీఎం
భూస్వాముల క‌బంధ హ‌స్తాల‌లో చిక్కుకున్న భూముల‌కు ఎట్ట‌కేల‌కు విముక్తి ల‌భించింది. క‌ష్ట‌జీవుల ప‌ర‌మ‌య్యాయి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు కోరంగి కంపెనీ భూముల్లో పోలెకుర్రు పంచాయతీకి చెందిన పేదలు గురువారం నాడు వ్యవసాయ ప‌నులు ప్రారంభించారు. వాస్త‌వానికి ఈనెల 13నే కోరంగి కంపెనీ భూములను సిపిఎం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి పేదలు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుపేట, జైభీమ్‌పేట, జార్జిపేట, తూర్పుపేట బిసి కాలనీ, ఎస్‌సి కాలనీలకు చెందిన సుమారు 200 మంది పేద‌లు ఈ భూముల్లో ప్రవేశించి దుక్కిదున్నారు. సుమారు 25 ఎకరాల భూములను వీరు కష్టపడి సాగులోకి తెచ్చారు. 15 ఎకరాల భూముల్లో విత్తనాలు జల్లారు. స్థానికంగా కోరంగి కంపెనీ భూములుగా పిలుచుకునే ఈ భూములను 30 ఏళ్లుగా భూస్వాములు అనుభవించారు. వీటిని తమకు పంచాలని పేదలు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. పేద‌ల పోరాటానికి మ‌ద్ద‌తుగా కోరంగి కంపెనీ భూముల పోరాట కమిటీ కూడా ఏర్పాట‌య్యింది. ఇన్నాళ్ల‌కు వారి క‌ల నెర‌వేరింది. ఈ భూముల్లో 15 బస్తాల వరి విత్తనాలను నాటామని కోరంగి కంపెనీ భూముల పోరాట కమిటీ నాయ‌కులు తమ్మిడి వీర్రాజు, పలివెల శేషారావు, గుత్తుల సత్యనారాయణ తెలిపారు. వ‌రినాట్ల కార్య‌క్ర‌మంలో సిపిఎం నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, కమిడి సత్య శ్రీనివాస్ ఇంకా స్థానిక నాయ‌కులు ప‌లువురు పాల్గొన్నారు.
Tags:    
Advertisement

Similar News