లింగ మార్పిడి వ్యక్తులకు అమెరికా మిలటరీలో చొటు?
లింగమార్పిడి చేయించుకున్న వారిని సైన్యంలో చేర్చుకోకూడదన్న నిషేధ ఆంక్షలను ఎత్తివేసేందుకు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ యోచిస్తోంది. వారం రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. అయితే వీరి నియామకాల తర్వాత పరిస్థితులను అంచనా వేయడానికి ఆరు నెలలపాటు సమయం పడుతుందని అనుకుంటున్నారు. నియామకాలకు సంబంధించి న్యాయ, ఆరోగ్య, పరిపాలనా పరమైన అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉన్నందున మరికొంత సమయం కావాలని రక్షణ శాఖ అధిపతులు భావిస్తున్నారు. ఈ అంశంపై సీనియర్ మిలటరీ, సివిలియన్ నాయకులతో […]
Advertisement
లింగమార్పిడి చేయించుకున్న వారిని సైన్యంలో చేర్చుకోకూడదన్న నిషేధ ఆంక్షలను ఎత్తివేసేందుకు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ యోచిస్తోంది. వారం రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. అయితే వీరి నియామకాల తర్వాత పరిస్థితులను అంచనా వేయడానికి ఆరు నెలలపాటు సమయం పడుతుందని అనుకుంటున్నారు. నియామకాలకు సంబంధించి న్యాయ, ఆరోగ్య, పరిపాలనా పరమైన అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉన్నందున మరికొంత సమయం కావాలని రక్షణ శాఖ అధిపతులు భావిస్తున్నారు. ఈ అంశంపై సీనియర్ మిలటరీ, సివిలియన్ నాయకులతో ఓ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని, ఆంక్షలు ఎత్తి వేయడానికి ముందే ఈ లింగ మార్పిడి చేయించుకున్న వారిని చేర్చుకుంటే ఉద్యోగ సమయంలో వాతావారణ పరిస్థితులను తట్టుకోగలరా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు సిబ్బంది వ్యవహారాల కార్యదర్శిని ఆదేశించారు. అలాగే వీరికి ఎలాంటి యూనిఫాం అమలు చేయాలో కూడా ఆలోచించాలని కోరారు.
Advertisement