వ్యాయామం అందరికీ ఆరోగ్య దాయకం
ఆటపాటలతోపాటు అందరికీ వ్యాయామం కూడా అవసరమే. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వలన శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు కలుగుతుంది. అందువల్ల పెద్దలు తాము చేయడంతోపాటు పిల్లలకు చిన్నప్పటి నుంచి వ్యాయామం చేయడం అలవాటు చేయాలి. దీనివల్ల ధృఢమైన కండరాలు, ఎముకల పెరుగుదలతోపాటు వ్యాయామంతో కీళ్లు బలపడతాయి. దీని ద్వారా శరీరం వృద్ధి చెందడంతోపాటు మానసికాభివృద్ధి చెంది చదువుపై శ్రద్ధ పెడతారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మానసిక ధృఢత్వం, మానసిక వికాసం పెంపొందుతుంది. వ్యాయామం చేయడం ద్వారం మనం పీల్చుకునే ఆక్సిజన్ […]
Advertisement
ఆటపాటలతోపాటు అందరికీ వ్యాయామం కూడా అవసరమే. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వలన శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు కలుగుతుంది. అందువల్ల పెద్దలు తాము చేయడంతోపాటు పిల్లలకు చిన్నప్పటి నుంచి వ్యాయామం చేయడం అలవాటు చేయాలి. దీనివల్ల ధృఢమైన కండరాలు, ఎముకల పెరుగుదలతోపాటు వ్యాయామంతో కీళ్లు బలపడతాయి. దీని ద్వారా శరీరం వృద్ధి చెందడంతోపాటు మానసికాభివృద్ధి చెంది చదువుపై శ్రద్ధ పెడతారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మానసిక ధృఢత్వం, మానసిక వికాసం పెంపొందుతుంది. వ్యాయామం చేయడం ద్వారం మనం పీల్చుకునే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. తద్వారా ఊపిరితిత్తులు, గుండె మెరుగ్గా పని చేస్తాయి. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీనివల్ల కచ్చితమైన నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు.
Advertisement