పారిశుధ్య సమ్మెను పట్టించుకోరా?
ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించే సమస్యలపై చంద్రబాబు సర్కారుకు అంతగా ఆందోళన ఉన్నట్లు కనిపించదు. ప్రజా సమస్యలను, ప్రజల ఆందోళనలను చాలా తేలికగా తీసుకోవడం చంద్రబాబుకు అలవాటు. ఐదు రోజులుగా కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను చంద్రబాబు అలాగే తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సమ్మె కొనసాగుతోంది. చెత్త పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా చంద్రబాబు గానీ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గానీ […]
Advertisement
ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించే సమస్యలపై చంద్రబాబు సర్కారుకు అంతగా ఆందోళన ఉన్నట్లు కనిపించదు. ప్రజా సమస్యలను, ప్రజల ఆందోళనలను చాలా తేలికగా తీసుకోవడం చంద్రబాబుకు అలవాటు. ఐదు రోజులుగా కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను చంద్రబాబు అలాగే తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సమ్మె కొనసాగుతోంది. చెత్త పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా చంద్రబాబు గానీ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గానీ దీనిపై స్పందించడమే లేదు. ప్రజల ఆరోగ్యమంటే అంత చులకనా? చంద్రబాబుకు, నారాయణకు ఇంతకన్నా ప్రధానమైన సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నారా అనుకుంటే అదీ లేదు. పుష్కర పనులు, ఏర్పాట్లలో ఘోరవైఫల్యం, తొక్కిసలాటలు, మరణాలు ఒకవైపు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించినా అన్నిరకాలుగా వైఫల్యం కనిపిస్తోంది. ఇక నారాయణ చూస్తే సీఆర్‌డీఏ చుట్టూనే ఆయన తిరుగుతున్నారు. భూసేకరణ ప్రయత్నాలకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమోద పత్రాలిచ్చిన రైతులు కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇలా వారికి ఎన్నో టెన్షన్లు. అందుకే మున్సిపల్ కార్మికులు, ప్రజలు వారికి పట్టకుండా పోయారు.
Advertisement