ప్రయివేటు కాలేజీలకు మళ్ళీ హైకోర్టులో ఊరట
హైకోర్టులో ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలకు ఊరట లభించింది. జెఎన్‌టియు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అయితే ఒక్క అంశంలో మాత్రం సవరణను సూచించింది. 10 రోజుల్లోగా మరోసారి ఈ కళాశాలలన్నింటిపై తనిఖీలు నిర్వహించాలని జెఎన్‌టియుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవకతవకలు కనుగొంటే ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఆదేశించింది. కౌన్సిలింగ్ ప్రక్రియను కూడా యధావిధిగా కొనసాగించవచ్చని సూచించింది. అయితే పది రోజుల్లోగా మరోసారి తనిఖీలు నిర్వహించాలని […]
Advertisement
హైకోర్టులో ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలకు ఊరట లభించింది. జెఎన్‌టియు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అయితే ఒక్క అంశంలో మాత్రం సవరణను సూచించింది. 10 రోజుల్లోగా మరోసారి ఈ కళాశాలలన్నింటిపై తనిఖీలు నిర్వహించాలని జెఎన్‌టియుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవకతవకలు కనుగొంటే ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఆదేశించింది. కౌన్సిలింగ్ ప్రక్రియను కూడా యధావిధిగా కొనసాగించవచ్చని సూచించింది. అయితే పది రోజుల్లోగా మరోసారి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించినందున… కౌన్సిలింగ్ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని సూచించడంలొ కొంత గందరగోళం ఏర్పడుతుందని విద్యార్థులంటున్నారు. ఒకవేళ తాము కౌన్సిలింగ్‌లో సీటు పొందిన కాలేజీలో తాజాగా జరిగే తనిఖీల్లో అవకతవకలున్నట్టు తేలితే తమ సీటు పరిస్థితి ఏమిటని, తమ భవిష్యత్ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ తనిఖీలు పూర్తయ్యేవరకు కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపి వేయవచ్చు కదా అంటున్నారు. దీనిపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేక పోతున్నారు.
Advertisement