వ్యాపంపై సీఎం చౌహాన్ కు కేంద్రమంత్రి మద్దతు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ పూర్తి మద్దతు ప్రకటించారు. వ్యాపం కుంభకోణంతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి ఖండించారు. సీఎం రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చౌహాన్‌పై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. వ్యాపం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. దోషులెవరో తెలిసేవరకూ ప్రతిపక్షాలు ఎదురు చూడాలని ఆయన హితవు పలికారు. వ్యాపం […]
Advertisement
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ పూర్తి మద్దతు ప్రకటించారు. వ్యాపం కుంభకోణంతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి ఖండించారు. సీఎం రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చౌహాన్‌పై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. వ్యాపం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. దోషులెవరో తెలిసేవరకూ ప్రతిపక్షాలు ఎదురు చూడాలని ఆయన హితవు పలికారు. వ్యాపం కుంభకోణానికి నిరసనగా గురువారం మధ్యప్రదేశ్ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రతిపక్షాల బంద్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
Advertisement