పుష్కరాల్లో మహావిషాదం... 40 మంది దుర్మరణం
పుష్కర మహోత్సవం తొలిరోజే అపశ్రుతి చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద మంగళవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 40 మందికి పైగా మృతిచెందగా, వందల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 300 మంది స్పృహ తప్పి పడిపోయారు. మృతులు వంద సంఖ్యను దాటుతుందని ప్రత్యక్షంగా అక్కడ పరిస్థితిని చూసిన వారు చెబుతున్నారు. రాజమండ్రిలోని అనేక ఆస్పత్రులు క్షతగాత్రులతో కిటకిటలాడుతున్నాయని, వీరిలో ఎక్కువ మంది పరిస్థితి కనీసం […]
Advertisement
పుష్కర మహోత్సవం తొలిరోజే అపశ్రుతి చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద మంగళవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 40 మందికి పైగా మృతిచెందగా, వందల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 300 మంది స్పృహ తప్పి పడిపోయారు. మృతులు వంద సంఖ్యను దాటుతుందని ప్రత్యక్షంగా అక్కడ పరిస్థితిని చూసిన వారు చెబుతున్నారు. రాజమండ్రిలోని అనేక ఆస్పత్రులు క్షతగాత్రులతో కిటకిటలాడుతున్నాయని, వీరిలో ఎక్కువ మంది పరిస్థితి కనీసం వారికి మంచినీళ్ళు కూడా అందుబాటులో లేక పోవడం గమనార్హం. మృతుల్లో ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం, విశాఖపట్నంలతోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఉదయాన్నే భారీ సంఖ్యలో పోటెత్తిన భక్తులను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. పుష్కర ఘాట్‌ల వద్ద ఎక్కువమంది పోలీసులు లేరని, ఉన్న పోలీసులందరు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఉన్నతాధికారుల, విఐపీలకు భద్రత, సౌకర్యాలు కల్పించటంలోనే నిమగ్నమయ్యారని అందువల్ల యాత్రికుల వద్ద ఎక్కువ మంది పోలీసులు లేకపోవడంతో ఈ తొక్కిసలాటకు దారి తీసిందని అంటున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుణ్యస్నానం ఆచరించటానికి వీలుగా మూడు గంటలపాటు కోటగుమ్మం ఘాట్‌లోకి భక్తులనెవరిని అనుమతించ లేదు. ఆయన స్నానం, పూజాధికాలు ముగిసిన వెంటనే ఒక్కసారిగా భక్తులంతా ఎగబడడంతో ఈ తొక్కిసలాట జరిగింది. చనిపోయిన భక్తులను ఒకరిమీద ఒకరిని వేసి అమానవీయ పరిస్థితుల మధ్య అక్కడినుంచి తరలించడం అది చూస్తున్న వారి మనసులను కలిచివేసింది.
మృతులకు పది లక్షల చొప్పున పరిహారం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆయన ఆస్పత్రి వర్గాలను ఆదేశించారు. తాను దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని సమీక్షించానని అన్నారు. ఒకే ఘాట్ వద్దకు అందరూ ఒక్కసారిగా రావడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని, ఇది చాలా బాధాకర విషయమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు. అవసరమైతే రాజమండ్రిలోనే పుష్కరాలు అయ్యే వరకు ఉంటానని తెలిపారు. పుష్కరాల తర్వాత ఈ దుర్ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.