మోడీ, గవర్నర్, కేసీఆర్, పవన్ దిగ్భ్రాంతి...
మహా పుష్కరాల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలిరోజు జరిగిన మహా విషాదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. మంగళవారం ఆయన ఫోన్‌లో సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఈ సంఘటన గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు. అందరూ కలిసి పని చేయడం ద్వారా ఇలాంటి వాటిని అధిగమించాలని ఆయన కోరారు. మరోవైపు కాంగ్రెస్ […]
Advertisement
మహా పుష్కరాల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలిరోజు జరిగిన మహా విషాదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. మంగళవారం ఆయన ఫోన్‌లో సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఈ సంఘటన గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు. అందరూ కలిసి పని చేయడం ద్వారా ఇలాంటి వాటిని అధిగమించాలని ఆయన కోరారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ కూడా రాజమండ్రి విషాదం తమను కలిచి వేసిందని వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారున్నారు. ఈ సంఘటన పట్ల గవర్నర్ నరసింహన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు రాజమండ్రి ఘటనను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో పుష్కరాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎస్పీలను, కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అన్ని వేళలందు అందుబాటులో ఉండి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
నేను రాకున్నా నా సేన ఉంది: పవన్ పిలుపు
రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాటపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పవన్ అన్నారు. తాను పరామర్శకు రావాల్సి ఉన్నప్పటికీ, తన రాక వల్ల ఇబ్బందుల ఎదురయ్యే అవకాశం ఉన్నందున రావటం లేదని పవన్ వివరణ ఇచ్చారు. తాను లేకపోయినా, తన అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్యం బాధిత కుటుంబాలకు తగినంత పరిహారాన్ని ప్రకటించాలని కోరారు. పుష్కరాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. భక్తులు కూడా సంయమనంతో పుష్కరాల్లో పాల్గొనాలని సూచించారు.
Advertisement