కాశ్మీర్‌ను ఎజెండాలో చేర్చకుంటే చర్చల్లేవ్
భారత పాక్‌ల మధ్య దశాబ్ధాలుగా నలుగుతున్న కాశ్మీర్ అంశాన్ని ఎజెండాలో చేర్చకుండా చర్చల ప్రసక్తే లేదని పాక్ జాతీయ భద్రతా సలహాదారు నర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. దీంతో పాక్ మరోసారి ప్లేటు ఫిరాయించిందని భారత్‌కు స్పష్టమైంది. రష్యాలో భారత, పాక్ ప్రధానుల భేటీ ముగిసిన కాసేపటికే అందులో పాలు పంచుకున్న నర్తాజ్ ఈ ప్రకటన విడుదల చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉఫా సమావేశాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి కొంత ఉపయోగపడతాయని, అయితే […]
Advertisement
భారత పాక్‌ల మధ్య దశాబ్ధాలుగా నలుగుతున్న కాశ్మీర్ అంశాన్ని ఎజెండాలో చేర్చకుండా చర్చల ప్రసక్తే లేదని పాక్ జాతీయ భద్రతా సలహాదారు నర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. దీంతో పాక్ మరోసారి ప్లేటు ఫిరాయించిందని భారత్‌కు స్పష్టమైంది. రష్యాలో భారత, పాక్ ప్రధానుల భేటీ ముగిసిన కాసేపటికే అందులో పాలు పంచుకున్న నర్తాజ్ ఈ ప్రకటన విడుదల చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉఫా సమావేశాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి కొంత ఉపయోగపడతాయని, అయితే అవి మాత్రమే పాక్‌ల మధ్య శాంతి సంబంధాలను నెలకొల్పలేవని ఆయన అన్నారు. ప్రస్తుతం రెండు దేశాలూ అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమయ్యాయి. అందులో కాశ్మీర్ అంశం మొదటి స్థానంలో ఉంటుంది. అదికాకుండా సియాచిన్. సర్ క్రీక్, జలవివాదాల వంటివి కూడా ఉన్నాయి. కాశ్మీర్ విషయంలో పాక్ తన వైఖరి మార్చుకోలేదు. అజెండాలో కాశ్మీర్ అంశం లేనట్లయితే, భారత్ పాక్‌ల మధ్య చర్చలు సాధ్యం కావని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. పాక్ రెండు నాల్కల వైఖరిపై భారత్ మండి పడుతోంది.
Advertisement