ఈ మరణాలకు చంద్రబాబే బాధ్యుడు

రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వీఐపీ ఘాట్లో ఎందుకు పూజలు చేసుకోలేదని జగన్ ప్రశ్నించారు. కేవలం పబ్లిసిటీ కోసమే వీఐపీ ఘాట్ను వదిలి జనం రద్దీగా ఉండే ఘాట్లోకి వెళ్ళి రెండున్నర గంటలపాటు పూజలు, స్నానాధికాలు నిర్వహించారని, చంద్రబాబు రాకముందు, చంద్రబాబు పూజలు చేస్తున్నంతసేపు సుమారు మూడు గంటలపాటు జనాలను ఘాట్లోకి అనుమతించలేదని… […]

Advertisement
Update:2015-07-14 11:10 IST

రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వీఐపీ ఘాట్లో ఎందుకు పూజలు చేసుకోలేదని జగన్ ప్రశ్నించారు. కేవలం పబ్లిసిటీ కోసమే వీఐపీ ఘాట్ను వదిలి జనం రద్దీగా ఉండే ఘాట్లోకి వెళ్ళి రెండున్నర గంటలపాటు పూజలు, స్నానాధికాలు నిర్వహించారని, చంద్రబాబు రాకముందు, చంద్రబాబు పూజలు చేస్తున్నంతసేపు సుమారు మూడు గంటలపాటు జనాలను ఘాట్లోకి అనుమతించలేదని… అప్పటిదాకా ప్రజలు గంటల తరబడి నిలబడలేక, తిరిగి వెనక్కి వెళ్ళిపోలేక నానా ఇబ్బందులు పడి, తాగడానికి మంచినీళ్ళుకూడా లేక బాధలు పడ్డారని, చంద్రబాబు వెళ్ళిపోవడంతో అప్పుడు గేటు తెరిచి జనాన్ని ఒక్కసారిగా వదలడంతో, తొక్కిసలాట చోటు చేసుకుందని అన్నారు. చంద్రబాబే తోపులాటకు కారణమయ్యారని ఆరోపించారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే, అధికారులంతా రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయి మిగిలిన విషయాలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు ఏమాత్రం మానవత్వం ఉన్నా కాశీకి పోయి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. ఇంత మంది మృతికి కారణమైన చంద్రబాబును జైల్లో పెట్టాలని అన్నారు.
తొక్కిసలాట పెద్ద ఎత్తున చోటు చేసుకోవడంతో అధికార యంత్రాంగం చేతులెత్తేసిందని, జనాన్ని కట్టడి చేసే సత్తా పోలీసుల్లో లోపించిందని ఆయన అన్నారు. వందలాది మందితో భద్రతా ఏర్పాట్లు చేశామని చెబుతున్న ప్రభుత్వం ఇపుడు జరిగిన సంఘటనకు సమాధానం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు ఉండడంతో ఆస్పత్రిలో సరైన ఏర్పాట్లు లేక నానా అవస్థలు పడుతున్నారని, తగినంత మంది డాక్టర్లుగాని, సిబ్బందిగాని లేరని, కనీసం సృహ కోల్పోయిన వారికి మంచినీరు ఇచ్చే సదుపాయం కూడా లేదని అన్నారు. ఎన్నో కబుర్లు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇపుడేం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ప్రకటనల డాబులో బాబు అందెవేసిన చేయ్యి అని, పుష్కర పనులు మాత్రం శూన్యమని, పైగా దీనికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అవినీతికి మరిగిన ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహించి సీఎం పదవి నుంచి వైదొలగాలని వై.ఎస్. జగన్ డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News