ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకే హరితహారం: వరవరరావు
బడుగు, బలహీన వర్గాల ప్రజలను నాశనం చేయడమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ధ్యేయమని విరసం నేత వరవరరావు అన్నారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకే తెలంగాణ ప్రభుత్వం హరిత హారం పథకం ప్రవేశపెట్టిందని విమర్శించారు. విప్లవ రచయిత సంఘం (విరసం) 45వ ఆవిర్భావ సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ పెట్టుబడిదారీ ఏజెంట్లుగా తెలంగాణ, ఏపీ సీఎంలు పని చేస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడి మనిషిని మనిషిగా కాకుండా సరుకుగా మారుస్తుందని, అధికారంలోకి […]
Advertisement
బడుగు, బలహీన వర్గాల ప్రజలను నాశనం చేయడమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ధ్యేయమని విరసం నేత వరవరరావు అన్నారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకే తెలంగాణ ప్రభుత్వం హరిత హారం పథకం ప్రవేశపెట్టిందని విమర్శించారు. విప్లవ రచయిత సంఘం (విరసం) 45వ ఆవిర్భావ సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ పెట్టుబడిదారీ ఏజెంట్లుగా తెలంగాణ, ఏపీ సీఎంలు పని చేస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడి మనిషిని మనిషిగా కాకుండా సరుకుగా మారుస్తుందని, అధికారంలోకి రాకముందు రామోజీ ఫిలింసిటీని వెయ్యి నాగళ్లతో దున్నిస్తానని ప్రగల్బాలు పలికిన కెసిఆర్ అధికారంలోకి వచ్చాక స్వయంగా రామోజీఫిలిం సిటీకెళ్లి అంగుళం కూడా అక్రమించుకోలేదని సర్టిఫికెట్ ఇవ్వడం దేనికి సంకేతమని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఓం సిటీ ఏర్పాటు చేస్తే ప్రపంచం మొత్తానికి ఆద్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని కొనియాడడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ సిఎం ముఖంలో బుద్దుడు, అశోకుడు కనిపిస్తున్నాడని ఒక కవి వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. ఆకలితో కడుపు మాడుతున్నప్పుడు, ప్రాణాలు పోయే పరిస్థితిలో అబద్దాలాడితే అర్దముంటుందన్నారు. కానీ పదవులు, సత్కా రాలు,శాలువాలు కప్పుకునేందుకు అబద్దాలాడితే సహించరానిదన్నారు. పోలవరం నిర్మాణం అయితే నెత్తుటేరులు పారుతాయని పలికిన వారు ఏడు మండలాలు తెలంగాణకు దక్కకుండా పోతే ఏం చేశారని ప్రశ్నించారు.
Advertisement