ఇక పోలీస్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీలు
పోలీస్ స్టేషన్ స్థాయిలో పని విధానం మెరుగుకై ఉన్నతాధికారుల ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించి క్రింది స్థాయిలో పోలీసుల పని విధానాన్ని మరింతగా మెరుగు పరచడానికి సీనియర్ ఐపిఎస్ అధికారులతో ఆకస్మిక తనికీలను నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధమవుతున్నది. రాష్ట్రంలోని పది జిల్లాల పోలీసుల పని తీరులో మరింతగా మార్పు తీసుకు రావాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల సీనియర్ అధికారులతో చర్చించిన డిజిపి అనురాగ్‌శర్మ అందుకు తగిన కార్యాచరణను రూపొందించే యోచనలో ఉన్నారు. అన్ని జిల్లాల […]
Advertisement
పోలీస్ స్టేషన్ స్థాయిలో పని విధానం మెరుగుకై ఉన్నతాధికారుల ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించి క్రింది స్థాయిలో పోలీసుల పని విధానాన్ని మరింతగా మెరుగు పరచడానికి సీనియర్ ఐపిఎస్ అధికారులతో ఆకస్మిక తనికీలను నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధమవుతున్నది. రాష్ట్రంలోని పది జిల్లాల పోలీసుల పని తీరులో మరింతగా మార్పు తీసుకు రావాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల సీనియర్ అధికారులతో చర్చించిన డిజిపి అనురాగ్‌శర్మ అందుకు తగిన కార్యాచరణను రూపొందించే యోచనలో ఉన్నారు. అన్ని జిల్లాల ఎస్‌పిలు, వారిపై పర్యవేక్షణకు రేంజ్ డిఐజిలు ఉన్నారు. నిబంధనల ప్రకారం వీరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి ఆయా పోలీసు స్టేషన్‌లను సందర్శించి అక్కడ జరుగుతున్న పనితీరును పరిశీలిస్తారు. అయితే వీరు పిఎస్‌కు ఎప్పుడు వస్తారో ముందుగానే తెలియడంతో సంబంధిత స్టేషన్ సిఐలు, ఇతర సిబ్బంది అప్రమత్తమై తగిన రిపోర్టులతో అధికారులకు వివరించడానికి సిద్ధంగా ఉంటున్నారు. దీంతో మొక్కుబడిగానే జిల్లా ఎస్‌పి, రేంజ్ డిఐజిల విజిట్‌లు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు భిన్నంగా ఏ క్షణంలోనైనా పోలీసు స్టేషన్‌లో హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్ నుంచి సీనియర్ ఐపిఎస్ అధికారులు వెళ్లి ఆకస్మిక తనికీలను నిర్వహించడం వలన వాస్తవాలు వెలుగు చూస్తాయని డిజిపి భావిస్తున్నారు. స్థానిక పోలీసుల పని తీరుపై అక్కడి ప్రజల నుంచి సమాచారాన్ని కూడా సేకరించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక పోలీసు స్టేసన్‌లో పరిస్థితి, వాతావరణం, రికార్డుల నిర్వాహణ, స్టేషన్ జనరల్ డైరీ నిర్వహణ మొదలైనవి కూడా కూలంకషంగా పరిశీలించవచ్చని భావిస్తున్నారు. ఈ విధంగా హెడ్ క్వార్టర్స్ నుంచి నెలలో ఒకటి రెండు రోజులు అదనపు డిజి స్థాయి అధికారులతో ఆకస్మిక తనికీలను నిర్వహించడానికి కార్యాచరణను డిజిపి రూపొందిస్తున్నారని తెలిసింది.
Advertisement