నేడు సండ్ర బెయిల్ పిటిష‌న్ విచార‌ణ!

ఓటుకు నోటు కేసులో అరెస్ట‌యిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య బెయిల్ పిటిష‌న్ నేడు విచార‌ణ‌కు రానుంది. రెండు రోజుల ఏసీబీ క‌స్ట‌డీకి పూర్తిగా స‌హ‌క‌రించినందున బెయిల్ మంజూరు చేయాల‌ని సండ్ర కోరే అవ‌కాశం ఉంది. అయితే, రెండు రోజుల క‌స్ట‌డీలో అస‌లు నోరువిప్ప‌లేద‌ని ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేయ‌వ‌ద్ద‌ని ఏసీబీ అభ్యంత‌రం తెలిపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ కేసులో మ‌రింత మంది నిందితులు ప‌రారీలో ఉన్నార‌ని, వారిని ప‌ట్టుకునే వ‌ర‌కు బెయిల్ ఇవ్వ‌వ‌ద్ద‌ని ఏసీబీ కోర్టులో […]

Advertisement
Update:2015-07-13 02:11 IST
ఓటుకు నోటు కేసులో అరెస్ట‌యిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య బెయిల్ పిటిష‌న్ నేడు విచార‌ణ‌కు రానుంది. రెండు రోజుల ఏసీబీ క‌స్ట‌డీకి పూర్తిగా స‌హ‌క‌రించినందున బెయిల్ మంజూరు చేయాల‌ని సండ్ర కోరే అవ‌కాశం ఉంది. అయితే, రెండు రోజుల క‌స్ట‌డీలో అస‌లు నోరువిప్ప‌లేద‌ని ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేయ‌వ‌ద్ద‌ని ఏసీబీ అభ్యంత‌రం తెలిపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ కేసులో మ‌రింత మంది నిందితులు ప‌రారీలో ఉన్నార‌ని, వారిని ప‌ట్టుకునే వ‌ర‌కు బెయిల్ ఇవ్వ‌వ‌ద్ద‌ని ఏసీబీ కోర్టులో వాదించే అవ‌కాశ‌ముంది. గతంలో సండ్రకు నోటీసులు పంపించగా బేఖాతరు చేశారన్న విషయాన్ని మరోసారి కోర్టుకు దృష్టికి తీసుకురావాలని, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినా అతడు దర్యాప్తుకు సహకరిస్తాడన్న నమ్మకంలేదని ఏసీబీ వాదించనున్నట్లు తెలిసింది. సండ్రను అరెస్టు చేసిన తొలిరోజు 24 గంటలు, ఆ తర్వాత కస్టడీకి తీసుకొని రెండురోజులు విచారించినందున.. బెయిల్ మంజూరు చేయాలంటూ అతని తరఫు న్యాయవాదుల కోర్టుకు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.
Tags:    
Advertisement

Similar News