ఐపీఎస్ అధికారిపై రేప్ కేసు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కేసు పెట్టి కొద్ది గంటలు కూడా గడవక ముందే అతనిపై అత్యాచార కేసు నమోదైంది. అమితాబ్ ఠాకూర్ తనపై అత్యాచారం చేశాడని ఘజియాబాద్‌కు చెందిన మహిళ గోమతీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఠాకూర్ ఇంట్లోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అతని భార్య సతున్ ఠాకూర్ కూడా దీనికి సహకరించిందని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ […]
Advertisement
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కేసు పెట్టి కొద్ది గంటలు కూడా గడవక ముందే అతనిపై అత్యాచార కేసు నమోదైంది. అమితాబ్ ఠాకూర్ తనపై అత్యాచారం చేశాడని ఘజియాబాద్‌కు చెందిన మహిళ గోమతీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఠాకూర్ ఇంట్లోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అతని భార్య సతున్ ఠాకూర్ కూడా దీనికి సహకరించిందని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఠాకూర్‌పై ఐపీసీ సెక్షన్లు 306,504,506ల ప్రకారం కేసు నమోదు చేశామని, సతుల్ ఠాకూర్‌ను సహనిందితురాలిగా చేర్చామని పోలీస్ అధికారి మహ్మద్ అబ్బాస్ వెల్లడించారు. అయితే, ములాయంపై కేసు పెట్టినందుకే తనపై అక్రమంగా అత్యాచార కేసు బనాయించారని ఠాకూర్ ఆరోపించారు.
Advertisement