పుష్కర బస్సుల్లో ఛార్జీల పెంపుపై తోకముడిచిన ఏపీ
ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలను వసూలు చేయాలని తపన పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. పుష్కరాలకు వెళ్ళే బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయాలని ముందు నిర్ణయించిన ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించకపోవడంతో దాన్ని విరమించారు. ఈ విషయాన్ని మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో సర్ ఛార్జీ పేరుతో ప్రయాణికులను బాదుడు బాదాలని చూసింది ఏపీ ప్రభుత్వం. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు […]
Advertisement
ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలను వసూలు చేయాలని తపన పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. పుష్కరాలకు వెళ్ళే బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయాలని ముందు నిర్ణయించిన ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించకపోవడంతో దాన్ని విరమించారు. ఈ విషయాన్ని మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో సర్ ఛార్జీ పేరుతో ప్రయాణికులను బాదుడు బాదాలని చూసింది ఏపీ ప్రభుత్వం. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సులకు 50 శాతం ఛార్జీలను అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లారు. అయితే సీఎం చంద్రబాబు దీనికి అంగీకరించలేదని, అందువల్ల ఛార్జీల పెంపు అంశాన్ని ఉపసంహరించుకుంటున్నామని మంత్రి శిద్దా తెలిపారు. ఆయన హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతూ పుష్కరాల బస్సులకు సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన చెప్పారు.
Advertisement