హరితహారంపై కరుణించని వరణుడు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి వరుణుడు ముఖం చాటేయడంతో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో హరితహారం లక్ష్యంగా ప్రభుత్వం జూలై 3వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభించింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నపాటి వర్షాలు కూడా కురవక పోవడంతో కార్యక్రమ నిర్వహణకు అడ్డంకులేర్పడ్డాయి. వారం రోజులుగా వానలు పడక పోవడంతో అటవీప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు నిలిపి వేశారు. ఇప్పటి వరకు రిజర్వ్ ఫారెస్టుల్లో పది లక్షల మొక్కలు […]
Advertisement
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి వరుణుడు ముఖం చాటేయడంతో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో హరితహారం లక్ష్యంగా ప్రభుత్వం జూలై 3వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభించింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నపాటి వర్షాలు కూడా కురవక పోవడంతో కార్యక్రమ నిర్వహణకు అడ్డంకులేర్పడ్డాయి. వారం రోజులుగా వానలు పడక పోవడంతో అటవీప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు నిలిపి వేశారు. ఇప్పటి వరకు రిజర్వ్ ఫారెస్టుల్లో పది లక్షల మొక్కలు నాటిన అధికారులు తిరిగి వర్షాలు కురిసిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. నీరు అందుబాటులో ఉన్న ప్రధాన రహదారులు, బస్తీలు, గ్రామాల్లో మాత్రం మొక్కలు నాటాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నాటిన మొక్కలను బతికించేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. అనుకూల వాతావరణం ఏర్పడే వరకు మొక్కలను నర్సరీల్లో భద్రపరచాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు.
Advertisement