రిలీవ్ చేసిన ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
తెలంగాణ ట్రాన్స్‌కోలో పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. ఆ ఉద్యోగుల తొలగింపుపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే ఇంతకుముందు ఇచ్చిన స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉద్యోగులపై ఇంతకుముందు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ ట్రాన్స్‌కో హైకోర్టును ఆశ్రయించింది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్‌కు పంపిన 1256 మంది విద్యుత్ ఉద్యోగులకు జీతాలను తెలంగాణ ట్రాన్స్‌కోయే చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ కేసు […]
Advertisement
తెలంగాణ ట్రాన్స్‌కోలో పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. ఆ ఉద్యోగుల తొలగింపుపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే ఇంతకుముందు ఇచ్చిన స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉద్యోగులపై ఇంతకుముందు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ ట్రాన్స్‌కో హైకోర్టును ఆశ్రయించింది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్‌కు పంపిన 1256 మంది విద్యుత్ ఉద్యోగులకు జీతాలను తెలంగాణ ట్రాన్స్‌కోయే చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. హైదరాబాద్‌లో పని చేస్తున్న ఏపీ ఉద్యోగలను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందే నిర్ణయం తీసుకుని వారిని రిలీవ్ కూడా చేసేసింది. అయితే దీనిపై కేంద్ర ఇంధనశాఖ మంత్రి, ఇంధన శాఖ కార్యదర్శి ఈ వివాదంపై ఈనెల 30 ఢిల్లీ రావాల్సిందిగా ఇరు రాష్ట్రాల ఇంధన కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. ఈవివాదంపై ఇపుడు హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాల కారణంగా జూన్ నెల జీతాలు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
Advertisement