ఇస్రో వాణిజ్య విభాగంపై హ్యాక‌ర్ల దాడి

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పోరేష‌న్ వెబ్‌సైట్‌పై హ్యాక‌ర్లు దాడికి పాల్ప‌డ్డార‌ని  సైబ‌ర్ సెక్యూరిటీ ప్రైవ‌సీ ఫౌండేష‌న్ అధ్య‌క్షుడు జి. ప్ర‌స‌న్న‌కుమార్ తెలిపారు. యాంత్రిక్స్‌ను రెండు రోజుల క్రితం హ్యాక‌ర్లు హ్యాక్ చేయ‌డంతో వెబ్‌సైట్‌ను నిలిపి వేశామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ దాడిలో చైనా హ్యాక‌ర్ల పాత్ర ఉంద‌ని అనుమానిస్తున్నామ‌ని, 2011లో కూడా యాంత్రిక్స్‌ను హ్యాక్ చేశార‌ని, అయినా అధికారులు స‌రైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు ఏర్పాటు చేయ‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.  యాంత్రిక్స్ […]

Advertisement
Update:2015-07-12 18:42 IST
భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పోరేష‌న్ వెబ్‌సైట్‌పై హ్యాక‌ర్లు దాడికి పాల్ప‌డ్డార‌ని సైబ‌ర్ సెక్యూరిటీ ప్రైవ‌సీ ఫౌండేష‌న్ అధ్య‌క్షుడు జి. ప్ర‌స‌న్న‌కుమార్ తెలిపారు. యాంత్రిక్స్‌ను రెండు రోజుల క్రితం హ్యాక‌ర్లు హ్యాక్ చేయ‌డంతో వెబ్‌సైట్‌ను నిలిపి వేశామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ దాడిలో చైనా హ్యాక‌ర్ల పాత్ర ఉంద‌ని అనుమానిస్తున్నామ‌ని, 2011లో కూడా యాంత్రిక్స్‌ను హ్యాక్ చేశార‌ని, అయినా అధికారులు స‌రైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు ఏర్పాటు చేయ‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. యాంత్రిక్స్ చైర్మ‌న్ వీ.ఎస్‌. హెగ్డే మాట్లాడుతూ, త్వ‌ర‌లోనే వెబ్‌సైట్‌ను పున‌రుద్ధ‌రిస్తామ‌ని, వార్షిక నివేదిక‌లు అప్‌లోడ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అయితే హ్యాక‌ర్లు యాంత్రిక్ వైబ్‌సైటును హ్యాక్ చేసిన మాట నిజ‌మేన‌ని, అయితే వారు తొలి పేజీలోకి మాత్ర‌మే వెళ్ళ‌గ‌లిగార‌ని, దీనిపై జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.
Tags:    
Advertisement

Similar News