కార్పొరేట్ల కొమ్ముకాస్తున్న మోడీ
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ ప్రధాని మోడీ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. పరిపాలనలో కార్పొరేట్ శక్తుల ఆధిపత్యమున్నంత కాలం కుంభకోణాలు జరుగుతూనే ఉంటాయన్నారు. మధ్యప్రదేశ్‌లోని వ్యాపం కుంభకోణంలో ఇప్పటికి 50 హత్యలు జరిగాయని తెలిపారు. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌కు కూడా పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందేనన్నారు. బిజెపిని విమర్శించే వారందరినీ ఏదోరకంగా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. అందుకు మద్రాస్ ఐఐటిలో అంబేద్కర్ పెరియార్ స్టుడెంట్ […]
Advertisement
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ ప్రధాని మోడీ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. పరిపాలనలో కార్పొరేట్ శక్తుల ఆధిపత్యమున్నంత కాలం కుంభకోణాలు జరుగుతూనే ఉంటాయన్నారు. మధ్యప్రదేశ్‌లోని వ్యాపం కుంభకోణంలో ఇప్పటికి 50 హత్యలు జరిగాయని తెలిపారు. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌కు కూడా పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందేనన్నారు. బిజెపిని విమర్శించే వారందరినీ ఏదోరకంగా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. అందుకు మద్రాస్ ఐఐటిలో అంబేద్కర్ పెరియార్ స్టుడెంట్ యూనియన్, సామాజిక కార్యకర్త తీస్తా సెల్వదత్‌ను ఉదహరణగా చెప్పొచ్చన్నారు. రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ చెప్పిన విధంగా 1934వ సంవత్సర పరిస్థితులు రాబోతున్నాయని హెచ్చరించారు. మోడీ ‘మేకిన్ ఇండియా’ పేరుతో బడాబాబుల జేబులు నింపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా,కార్మిక సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Advertisement