ఏపీలో మున్సిపల్ సమ్మె ఉధృతం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు మూడు రోజులుగా చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. సమ్మెలో భాగంగా పుష్కర విధులను కూడా బహిష్కరిస్తున్నట్లు మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సంఘం నేతలు స్పష్టం చేశారు. శనివారం రాత్రి రాజమండ్రిలో మంత్రులు నారాయణ, యనమలతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అనంతరం సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులందరికీ 43 శాతం పీఆర్సీ అమలు చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించ […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు మూడు రోజులుగా చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. సమ్మెలో భాగంగా పుష్కర విధులను కూడా బహిష్కరిస్తున్నట్లు మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సంఘం నేతలు స్పష్టం చేశారు. శనివారం రాత్రి రాజమండ్రిలో మంత్రులు నారాయణ, యనమలతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అనంతరం సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులందరికీ 43 శాతం పీఆర్సీ అమలు చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించ లేదన్నారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనం రూ.8,300లను 43 శాతం పీఆర్సీతో కలిపి రూ.15,432లు చేయాలని చర్చల్లో తాము కోరామన్నారు. కానీ సంతలో బేరమాడిన మాదిరి మున్సిపల్ మంత్రి కేవలం రూ.2 వేలు మాత్రమే పెంచుతామని చేతులెత్తేశారని తెలిపారు. ఇంతకుముందు పుష్కరాలు జరిగే ప్రాంతాలను సమ్మె నుంచి మినహాయిస్తామని చెప్పినా, ఇప్పుడు పుష్కరాలు జరిగే ప్రాంతాల్లోనూ సమ్మె చేస్తామని ప్రకటించారు. కాగా మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.8,300లకు మరో రూ.2వేలు వేతనం పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాల్టీల్లో 92 నష్టాల్లో ఉన్నాయని, వాటి నుంచి రూ.691 కోట్లు ఆదాయం వస్తుండగా రూ.795 కోట్లు ఖర్చవుతుందని, 123 కోట్లు నష్టం వస్తుందన్నారు.
Advertisement