జనవరిలోనే ట్యాపింగ్‌కు యత్నాలు!
ఓటుకు నోటు కేసులో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు మరో వివాదంలో కూరుకుపోయారు. 20-50 ఫోన్లు, ఈ-మెయిళ్లను హ్యాక్ చేసేందుకు కావాల్సిన అత్యాధునిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేసేందుకు జరిగిన ప్రయత్నాలను శుక్రవారం వికీలీక్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే! అయితే, ఈ ప్రయత్నాలు జరిగింది జూన్ మొదటి వారంలో కాదని, జనవరిలోనే అని మరో బాంబు పేల్చింది.. సాక్షి దినపత్రిక. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలతో సహ తాజాగా ప్రచురించిన కథనం ఏపీ సీఎంకు మరింత […]
Advertisement
ఓటుకు నోటు కేసులో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు మరో వివాదంలో కూరుకుపోయారు. 20-50 ఫోన్లు, ఈ-మెయిళ్లను హ్యాక్ చేసేందుకు కావాల్సిన అత్యాధునిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేసేందుకు జరిగిన ప్రయత్నాలను శుక్రవారం వికీలీక్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే! అయితే, ఈ ప్రయత్నాలు జరిగింది జూన్ మొదటి వారంలో కాదని, జనవరిలోనే అని మరో బాంబు పేల్చింది.. సాక్షి దినపత్రిక. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలతో సహ తాజాగా ప్రచురించిన కథనం ఏపీ సీఎంకు మరింత మకిలి అంటించింది. ఏకంగా ఇందుకోసం రూ.50 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైన తీరు చూస్తుంటే.. బాబు తెలంగాణను అస్థిర పరిచేందుకు ఎంతగా దిగజారారో అర్థమవుతోందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న చందంగా రేవంత్‌రెడ్డి అరెస్టు, చంద్రబాబుటేపుల వ్యవహారం వెలుగు చూడగానే… ఉన్నపలంగా బాబుతో సహా టీడీపీ నేతలంతా.. ట్యాపింగ్ రాగం అందుకోవడానికి కారణం కూడా ఇదేనని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. మీరు ట్యాపింగ్ కు యత్నించారు.. కాబట్టి అందరూ అదే పని చేస్తారనుకోవడం మీ సంకుచిత ఆలోచన ధోరణికి నిదర్శనమని ఎద్దేవా చేస్తున్నారు.
Advertisement