వనజాక్షి-చింత‌మ‌నేని వివాదానికి తెర

ముసునూరు తాహసిల్దారు వనజాక్షి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మధ్య వివాదం సద్దుమణిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని రెవిన్యూ సిబ్బందితోను, బాధితురాలు వనజాక్షితోను మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వీరు శాంతించారు. మొత్తం సంఘటనపై విచారణకు ఓ ఐఎఎస్‌ అధికారితో విచారణ జరిపించాలన్న రెవిన్యూ ఉద్యోగ సంఘం డిమాండును ఆయన అంగీకరించారు. విచారణలో బయటపడిన దోషులను శిక్షిస్తామని, ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని చంద్రబాబు కోరడంతో తాము కాదనలేక పోయామని బాధిత తహసిల్దారు వనజాక్షి, […]

Advertisement
Update:2015-07-11 05:00 IST
ముసునూరు తాహసిల్దారు వనజాక్షి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మధ్య వివాదం సద్దుమణిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని రెవిన్యూ సిబ్బందితోను, బాధితురాలు వనజాక్షితోను మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వీరు శాంతించారు. మొత్తం సంఘటనపై విచారణకు ఓ ఐఎఎస్‌ అధికారితో విచారణ జరిపించాలన్న రెవిన్యూ ఉద్యోగ సంఘం డిమాండును ఆయన అంగీకరించారు. విచారణలో బయటపడిన దోషులను శిక్షిస్తామని, ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని చంద్రబాబు కోరడంతో తాము కాదనలేక పోయామని బాధిత తహసిల్దారు వనజాక్షి, రెవిన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు చెప్పారు. అంతకుముందు…
కృష్ణా జిల్లా ముసునూరు తాహసిల్దారు వనజాక్షిపై జరిగిన దాడిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తన పరిపాలనలో మహిళలకు పూర్తి భద్రత ఉంటుందని, జరిగిన సంఘటనకు ఎంతో బాధ పడుతున్నానని అన్నారు. అయితే ఈ మాటలు మాట్లాడిన చంద్రబాబు నిందితులపై చర్యలు తీసుకుంటానని మాత్రం చెప్పలేదు. ఈనేపథ్యంలో శుక్రవారం మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే వంశీతో జరిగిన చర్చలు విఫలమవడంతో రెవిన్యూ సిబ్బంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే ఈ వివాదాన్ని తేల్చుకుంటామని భీష్మించారు. దీంతో ఇపుడు కథ చంద్రబాబు కోర్టుకు వెళ్ళింది. నిజానికి శుక్రవారం ఈ సమస్య సమసి పోవల్సి ఉంది. కాని రెవిన్యూ ఉద్యోగులు చింతమనేని అరెస్ట్‌కు పట్టుపడుతుండడంతో వివాదం పీట‌ముడి వీడే ప‌రిస్థితి కనిపించ‌ లేదు. త‌మ డిమాండ్లు నెర‌వేర‌క పోవ‌డంతో సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే తేల్చుకుంటామ‌ని రెవిన్యూ ఉద్యోగులు భీష్మించ‌డంతో స‌మ‌స్య ప‌రిష్కారంలో ప్ర‌తిష్టంభ‌న ఏర్పడింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ నుంచి వ‌చ్చేలోపు దీన్ని ప‌రిష్క‌రించి వివాదానికి ముగింపు ప‌ల‌కాల‌ని ఇరిగేష‌న్ శాఖ మంత్రి దేవినేని ఉమ‌, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. శుక్ర‌వారం రెవిన్యూ ఉద్యోగ సంఘాల‌ను, బాధితుల‌ను చ‌ర్చ‌ల‌కు పిలిచినా వారి డిమాండ్లు నెర‌వేర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. దాడి చేసిన ఎమ్మెల్యే చింత‌మ‌నేనిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని, దాడిలో భాగ‌స్వామి అయిన ఆయ‌న గ‌న్‌మెన్‌ను పోలీసు శాఖ‌కు స‌రెండ‌ర్ చేయాల‌ని, సంఘ‌ట‌న స్థ‌లిలో ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించిన‌ ఎస్సైని, కానిస్టేబుళ్ళ‌ను స‌స్పెండ్ చేయాల‌ని వారు ప్ర‌ధానంగా డిమాండు చేశారు. అయితే ఎమ్మెల్యే అరెస్ట్ త‌ప్ప మిగిలిన వాటిపై ఇప్ప‌టికే అధికారుల‌కు ఆదేశాలిచ్చామ‌ని, విధుల‌కు హాజ‌రు కావాల‌ని ఉమ‌, వంశీ కోరిన‌ప్ప‌టికీ వారు ప‌ట్టు వీడ‌లేదు. ఎమ్మెల్యే అర‌స్ట్‌పైనే భీష్మించ‌డంతో చేసేదేమీ లేక చ‌ర్చ‌ల‌ను ముగించారు. ఆ త‌ర్వాత రెవిన్యూ ఉద్యోగుల ప్ర‌తినిధులు మాట్లాడుతూ తాము డిమాండ్లు నెర‌వేరే వ‌ర‌కు విధుల‌కు హాజ‌రు కాబోమ‌ని, ముఖ్య‌మంత్రి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న వ‌ద్దే తేల్చుకుంటామ‌ని తెగేసి చెప్పారు. దీంతో చంద్రబాబు కల్పించుకుని రెవిన్యూ ఉద్యోగులతో చర్చలు జరిపి శాంతింపజేశారు.
Tags:    
Advertisement

Similar News