ఎంపీ కొడుకును చావ‌గొట్టిన అమ్మాయిలు!

లండన్‌లో దారుణం జరిగింది. ముగ్గురు అమ్మాయిల చేతిలో ఓ ఎంపి కొడుకు చావుదెబ్బలు తిని అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ళిపోయాడు. బ్రిటన్‌లోని కన్సర్వేటివ్‌ పార్టీ మహిళా ఎంపి విక్టోరియా బోర్విక్ కుమారుడు టామ్‌ బోర్విక్‌ (27) ను దారుణంగా కొట్టి స్పృహ కొల్పోయేలా చేసిన ఘటన అక్కడ కలకలం రేపింది. లండన్‌లోని లీసెస్టర్‌ స్క్వేర్‌కు సమీపంలోని కేఎఫ్‌సి కౌంటర్‌ దగ్గర తన స్నేహితులతో కలిసి పుడ్‌ కోసం క్యూలో వేచి ఉండగా ఒక చిన్న వివాదం చోటు చేసుకుంది. […]

Advertisement
Update:2015-07-10 18:44 IST
లండన్‌లో దారుణం జరిగింది. ముగ్గురు అమ్మాయిల చేతిలో ఓ ఎంపి కొడుకు చావుదెబ్బలు తిని అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ళిపోయాడు. బ్రిటన్‌లోని కన్సర్వేటివ్‌ పార్టీ మహిళా ఎంపి విక్టోరియా బోర్విక్ కుమారుడు టామ్‌ బోర్విక్‌ (27) ను దారుణంగా కొట్టి స్పృహ కొల్పోయేలా చేసిన ఘటన అక్కడ కలకలం రేపింది. లండన్‌లోని లీసెస్టర్‌ స్క్వేర్‌కు సమీపంలోని కేఎఫ్‌సి కౌంటర్‌ దగ్గర తన స్నేహితులతో కలిసి పుడ్‌ కోసం క్యూలో వేచి ఉండగా ఒక చిన్న వివాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న వారితో మాటామాటా పెరిగడంతో క్యూలో ఉన్న ఒక అమ్మాయి టామ్‌పై విరుచుకు పడింది. దెబ్బలు తట్టుకోలేక టామ్‌ పారిపోతుండగా అక్కడ ఉన్న మ‌రో ఇద్దరు అమ్మాయిలు వెంటపడి మరీ చితకబాదారు. దీంతో టామ్ అక్కడిక్కడ కుప్పకూలిపోయాడు. అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
Tags:    
Advertisement

Similar News