ప్రాణం తీసిన ఫ్లైయింగ్ కిస్!
పొరుగింటి అబ్బాయికి గాల్లో ముద్దిచ్చినందుకు భార్యను చంపేశాడో పూజారి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. శివప్రకాష్, సాధనలు భార్యా భర్తలు. వారి పక్కింట్లో ఉన్న యువకుడితో సాధనకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో శివప్రకాష్ ఆమెను తరుచుగా వేధించడంతోపాటు, సిగిరెట్లతో ఆమె శరీరాన్ని కాలుస్తుండేవాడు. అతడిని కూడా తరచుగా తన భార్యతో గల సంబంధాన్ని ప్రశ్నిస్తుండేవాడు. ఆ యువకుడికి సాధన ఒకరోజు గాల్లోకి ముద్దులు విసరడం చూసిన శివప్రకాష్ ఆమెను కిరాతకంగా చంపేశాడు. అయితే, […]
Advertisement
పొరుగింటి అబ్బాయికి గాల్లో ముద్దిచ్చినందుకు భార్యను చంపేశాడో పూజారి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. శివప్రకాష్, సాధనలు భార్యా భర్తలు. వారి పక్కింట్లో ఉన్న యువకుడితో సాధనకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో శివప్రకాష్ ఆమెను తరుచుగా వేధించడంతోపాటు, సిగిరెట్లతో ఆమె శరీరాన్ని కాలుస్తుండేవాడు. అతడిని కూడా తరచుగా తన భార్యతో గల సంబంధాన్ని ప్రశ్నిస్తుండేవాడు. ఆ యువకుడికి సాధన ఒకరోజు గాల్లోకి ముద్దులు విసరడం చూసిన శివప్రకాష్ ఆమెను కిరాతకంగా చంపేశాడు. అయితే, ఎవరికీ తనపై అనుమానం రాకుండే ఉండేందుకు ఇంట్లో దొంగలు పడి తన భార్యను చంపేశారని, నగదు, నగలు దోచుకెళ్లారని నాటకం ఆడాడు. అయితే, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం వెల్లడైంది.
Advertisement