గవర్నర్ ను మార్చబోతున్నారా?
ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను మార్చబోతున్నారా…? ఒక రాష్ర్టానికి పరిమితిం చేసి కొత్త గవర్నర్‌గా వేరేవారిని నియమిస్తారా లేక రెండు రాష్ర్టాలకు ఇద్దరు కొత్త గవర్నర్లను నియమిస్తారా..? ఇలాంటి ప్రశ్నలు, ఊహాగానాలు మరలా మీడియాలో ఊపందుకున్నాయి. గవర్నర్ మార్పు తథ్యమన్న ప్రచారం మళ్లీ మొదలయ్యింది. మధ్యప్రదేశ్ గవర్నర్ మార్పు ఉంటుందని ఊహిస్తున్న తరుణంలో నరసింహన్ మార్పు కూడా ఉండవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. వ్యాపమ్ కుంభకోణంలో మధ్యప్రదేశ్ గవర్నర్ పాత్ర ఉన్నట్లు విమర్శలు వస్తున్న […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను మార్చబోతున్నారా…? ఒక రాష్ర్టానికి పరిమితిం చేసి కొత్త గవర్నర్‌గా వేరేవారిని నియమిస్తారా లేక రెండు రాష్ర్టాలకు ఇద్దరు కొత్త గవర్నర్లను నియమిస్తారా..? ఇలాంటి ప్రశ్నలు, ఊహాగానాలు మరలా మీడియాలో ఊపందుకున్నాయి. గవర్నర్ మార్పు తథ్యమన్న ప్రచారం మళ్లీ మొదలయ్యింది. మధ్యప్రదేశ్ గవర్నర్ మార్పు ఉంటుందని ఊహిస్తున్న తరుణంలో నరసింహన్ మార్పు కూడా ఉండవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. వ్యాపమ్ కుంభకోణంలో మధ్యప్రదేశ్ గవర్నర్ పాత్ర ఉన్నట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనను తొలగిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్ గవర్నర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇవ్వడంతో ఆయనను తొలగించడం ఖాయమని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో పనిలోపనిగా ఎపి, తెలంగాణ ప్రభుత్వాల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ ను కేంద్రం మార్చే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. ఇప్పటికే గవర్నర్‌పై తెలుగుదేశం నేతలు ఫిర్యాదులు చేస్తుండగా, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వ్యవహారం కూడా గవర్నర్‌పై విమర్శలకు తావిచ్చింది. తలసాని టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంకా తెలుగుదేశం ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇప్పటికీ శాసనసభ్యునిగా ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. దీనిపై గవర్నర్‌కు కూడా తెలుగుదేశం నేతలు ఫిర్యాదులు చేశారు. ఈ అంశంలో గవర్నర్ తగిన విధంగా స్పందించలేదన్న ప్రచారం ఉండనే ఉంది. అలాగే సెక్షన్-8 అమలులో కూడా ఆయన స్వతంత్రంగా వ్యవహరించడం లేదని కేంద్రానికి తెలుగుదేశం నాయకులు ఫిర్యాదులు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ మార్పుపై ప్రచారం ఊపందుకుంది.
Advertisement