ప్రతి నిరుపేద ముస్లిం కుటుంబానికీ రెండు చీరలు
రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి నిరుపేద ముస్లిం కుటుంబానికీ రెండు చీరలు, 5.5 మీటర్ల తెల్లని కుర్తా పైజామా దుస్తులు కానుకగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరుపేద ముస్లిం కుటుంబాలకు రూ.500 విలువ చేసే బట్టలు కానుకగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ముస్లింలకు దుస్తుల పంపిణీ, ప్రభుత్వం తరపున ఇచ్చే ఇఫ్తార్ విందుల నిర్వహణ […]
Advertisement
రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి నిరుపేద ముస్లిం కుటుంబానికీ రెండు చీరలు, 5.5 మీటర్ల తెల్లని కుర్తా పైజామా దుస్తులు కానుకగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరుపేద ముస్లిం కుటుంబాలకు రూ.500 విలువ చేసే బట్టలు కానుకగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ముస్లింలకు దుస్తుల పంపిణీ, ప్రభుత్వం తరపున ఇచ్చే ఇఫ్తార్ విందుల నిర్వహణ కోసం ఏసీబీ డీజీ ఖాన్ అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈనెల 12న నగరంలోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం ఇవ్వనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్ల గురించి అధికారులు ఆయనకు వివరించారు.
Advertisement