అశ్లీల వెబ్‌సైట్ల కట్టడిలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై సుప్రీం అసంతృప్తి
యువతరంపై విపరీత ప్రభావం చూపుతున్న అశ్లీల వెబ్‌సైట్లను కట్టడి చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పోర్న్ వెబ్‌సైట్లను నిరోధించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలెందుకు తీసుకోవడం లేదని జస్టిస్ హెచ్ దత్తుతో కూడిన సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అశ్లీల, నగ్న దృశ్యాలతో ఉన్న వెబ్‌సైట్లను నిరోధించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని, ముఖ్యంగా చిన్నారులతో చిత్రీకరించిన నగ్నదృశ్యాలను చూపుతున్న చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్‌సైట్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని […]
Advertisement
యువతరంపై విపరీత ప్రభావం చూపుతున్న అశ్లీల వెబ్‌సైట్లను కట్టడి చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పోర్న్ వెబ్‌సైట్లను నిరోధించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలెందుకు తీసుకోవడం లేదని జస్టిస్ హెచ్ దత్తుతో కూడిన సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అశ్లీల, నగ్న దృశ్యాలతో ఉన్న వెబ్‌సైట్లను నిరోధించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని, ముఖ్యంగా చిన్నారులతో చిత్రీకరించిన నగ్నదృశ్యాలను చూపుతున్న చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్‌సైట్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టుకు గతంలో కేంద్రం హామీ ఇచ్చింది. అయితే, ఇంతవరకూ కేంద్రం ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సుప్రీం వ్యాఖ్యానించింది. అశ్లీల వెబ్‌సైట్లను వీక్షించే హక్కు పెద్దవారికి ఉంది కనుక వారికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వేసిన పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసు సమాచార ప్రసార శాఖ పరిధిలోకి రాదని, టెలీకమ్యూనికేషన్స్ విభాగం పరిధిలోకి వస్తుందని అడిషినల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ కోర్టుకు విన్నవించారు.
Advertisement