పారిశుధ్యానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు 

ప‌విత్ర రంజాన్ మాసం, పైగా బోనాల పండుగ‌, వీటికి తోడు వ‌ర్షాకాలం… వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స‌మ్మె విర‌మించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సోమేష్‌కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు విజ్ఞ‌ప్తి చేశారు. లేకుంటే  ”నో వర్క్‌… నో పే” అమలు చేస్తామని ఆయ‌న అన్నారు. కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నందున నగరంలో పారిశుధ్య చర్యలను మెరుగుపరిచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం […]

Advertisement
Update:2015-07-10 05:47 IST
ప‌విత్ర రంజాన్ మాసం, పైగా బోనాల పండుగ‌, వీటికి తోడు వ‌ర్షాకాలం… వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స‌మ్మె విర‌మించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సోమేష్‌కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు విజ్ఞ‌ప్తి చేశారు. లేకుంటే ”నో వర్క్‌… నో పే” అమలు చేస్తామని ఆయ‌న అన్నారు. కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నందున నగరంలో పారిశుధ్య చర్యలను మెరుగుపరిచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని, సమ్మె విరమించాలని కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్‌ పరిధిలో శానిటేషన్‌ చేపట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన 400 స్వచ్ఛ యూనిట్ల నోడల్‌ అధికారులతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ టీమ్‌లు పని చేస్తాయన్నారు. ఒక్కో యూనిట్‌కు చెత్తను తరలించడానికి వాహనం, నలుగురు కార్మికులు ఉంటారని చెప్పారు. వీరికి రోజుకు రూ.350 చొప్పున చెల్లిస్తామన్నారు. 18 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనాల ద్వారా 60 మంది కార్మికులు చెత్తను తరలించనున్నారని తెలిపారు. శానిటేషన్‌ పనులను డిప్యూటీ కమిషనర్లు, ఎఎంఓహెచ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, డిపిఓలు పర్యవేక్షిస్తారన్నారు. పారిశుధ్య పనుల్లో భాగస్వామ్యమవడానికి స్థానిక మహిళా సంఘాలు, యువకులు, డ్రైవర్లు ముందుకొస్తున్నట్లు తెలిపారు. హోటల్స్‌, దుకాణ సముదాయాల వారు చెత్తను బయట పడేయకుండా డంపింగ్‌ యార్డ్స్‌కు తరలించాలన్నారు. నగరంలో 80 అత్యవసర బృందాలను ఏర్పాటు చేసినట్లు.. ఇందులో 400 మంది కార్మికులుంటారని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఈ విషయంలో శానిటేషన్‌ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పర్యావేక్షించాలని కోరారు. విధులకు హాజరయ్యే శానిటేషన్‌ సిబ్బందిని, వాహనాలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశించారు.
Tags:    
Advertisement

Similar News