సప్త శిఖరాలపై కవలల కొత్త రికార్డు
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలున్నాయి. ఆ ఏడు పర్వతాలనూ ఎక్కాలని కలలు కనని పర్వతారోహకులు ఉండరంటే అతిశయోక్తి లేదు. దీనినే ఎక్స్‌ప్లోరర్స్ గ్రాండ్‌స్లామ్ అంటారు. మరి ఆ ఏడు పర్వతాలను అత్యంత వేగంగా అధిరోహిస్తే అదీ చరిత్ర. ఘనమైన ఆ చరిత్రలో భారతదేశానికి భాగస్వామ్యం కల్పించారు ఇరవై నాలుగేళ్ల తశీ, నాన్సీ మాలిక్ అనే కవల సోదరీమణులు. ఏడు ఖండాల్లోని ఎత్తైన ఏడు పర్వతాలనూ వేగంగా అధిరోహంచి వాటిపై మువ్వన్నెల జెండాను సగర్వంగా రెపరెపలాడించారు. […]
Advertisement
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలున్నాయి. ఆ ఏడు పర్వతాలనూ ఎక్కాలని కలలు కనని పర్వతారోహకులు ఉండరంటే అతిశయోక్తి లేదు. దీనినే ఎక్స్‌ప్లోరర్స్ గ్రాండ్‌స్లామ్ అంటారు. మరి ఆ ఏడు పర్వతాలను అత్యంత వేగంగా అధిరోహిస్తే అదీ చరిత్ర. ఘనమైన ఆ చరిత్రలో భారతదేశానికి భాగస్వామ్యం కల్పించారు ఇరవై నాలుగేళ్ల తశీ, నాన్సీ మాలిక్ అనే కవల సోదరీమణులు. ఏడు ఖండాల్లోని ఎత్తైన ఏడు పర్వతాలనూ వేగంగా అధిరోహంచి వాటిపై మువ్వన్నెల జెండాను సగర్వంగా రెపరెపలాడించారు. గతంలో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన తొలి కవలలుగా గిన్నిస్ రికార్డు సృష్టించిన వీరు తాజాగా ఎక్స్‌ప్లోరర్స్ గ్రాండ్‌స్లామ్‌ను అత్యంత వేగంగా అధిరోహించిన దక్షిణాసియా పర్వతారోహకులుగా మరో రికార్డును సాధించారు. భారత మాజీ నావల్ అధికారి సత్యబ్రత్‌దామ్ తర్వాత దక్షిణాసియా నుంచి ఎక్స్‌ప్లోరర్స్ గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన ఘనత ఈ కవల సోదరీమణులదే. ఆఫ్రికా ఖండంలోని అతి పెద్ద పర్వతం కిలిమంజారోను సైతం వీరు అధిరోహించారు. కష్టతరమైన ఎన్నో రికార్డులు సాధించి దేశప్రతిష్ఠను ఇనుమడింప చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు సరైన ఆర్థిక ప్రోత్సాహం లభించడం లేదని ఈ సోదరీమణులు వాపోతున్నారు.
Advertisement