నాకేం తెలియ‌దు.. నాకేం సంబంధం లేదు!

నాకేం తెలియ‌దు.. నాకు సంబంధం లేదు.. ఇవీ ఏసీబీ విచార‌ణ‌లో ఎమ్మెల్యే సండ్ర చెప్పిన స‌మాధానాలు. ఈనెల 6న ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు ఖ‌మ్మం జిల్లా స‌త్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌.  ఆయ‌న‌ను ఉద‌యం  నుంచి సాయంత్రం దాకా దాదాపు 7 గంట‌ల‌పాటు ప్ర‌శ్నించిన ఏసీబీ ఎదుట ఆయ‌న నోరు విప్పి ఒక్క స‌మాధానం కూడా చెప్ప‌లేదు. అన్నింటికి రెండే ముక్క‌ల స‌మాధానం చెప్పారంట‌. నాకేం తెలియ‌దు.. నాకేం సంబంధం లేదు […]

Advertisement
Update:2015-07-09 02:51 IST
నాకేం తెలియ‌దు.. నాకు సంబంధం లేదు.. ఇవీ ఏసీబీ విచార‌ణ‌లో ఎమ్మెల్యే సండ్ర చెప్పిన స‌మాధానాలు. ఈనెల 6న ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు ఖ‌మ్మం జిల్లా స‌త్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌. ఆయ‌న‌ను ఉద‌యం నుంచి సాయంత్రం దాకా దాదాపు 7 గంట‌ల‌పాటు ప్ర‌శ్నించిన ఏసీబీ ఎదుట ఆయ‌న నోరు విప్పి ఒక్క స‌మాధానం కూడా చెప్ప‌లేదు. అన్నింటికి రెండే ముక్క‌ల స‌మాధానం చెప్పారంట‌. నాకేం తెలియ‌దు.. నాకేం సంబంధం లేదు అని. సండ్ర చెబుతున్న స‌మాధానాల‌తో విసిగిపోయిన ఏసీబీ ఇక లాభం లేద‌నుకుని అరెస్టు చేసింది. అనంత‌రం కోర్టు జ్యుడీషియ‌రీ రిమాండ్ విధించింది. తాజాగా బుధ‌వారం రెండు రోజుల‌పాటు ఏసీబీ క‌స్ట‌డీకి అప్ప‌గించింది. అయితే, ఈ సారైనా సండ్ర నోరువిప్పుతాడా? అన్న‌ది అనుమాన‌మే! ఓటుకు నోటు విష‌యంలో నోటీసులు జారీ అయ్యాయ‌ని తెలియ‌గానే సండ్ర రాష్ర్ట స‌రిహ‌ద్దులు దాటారు. ఏపీలో త‌ల‌దాచుకున్నారు. అనారోగ్యం పేరుతో విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా వివాదాన్ని పెద్ద‌ది చేసుకున్నారు. అక్క‌డ ఏసీబీ విచార‌ణ‌ను ఎలా ఎదుర్కోవాలో న‌లుగురు సీనీయ‌ర్ పోలీసులు అధికారులు సండ్ర‌కు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు కొన్ని మీడియాల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి. దాదాపు రెండు వారాల త‌రువాత మ‌రోసారి నోటీసులు అందుకున్న సండ్ర ఈ నెల 6న జ‌రిగిన విచార‌ణ‌లో నోరు విప్ప‌లేదు. అంటే సండ్ర శిక్ష‌ణ తీసుకున్నాడ‌న్న‌ వార్త‌లు నిజ‌మేమోన‌న్న అనుమానాలు క‌లుగుతున్నాయి. కాల్ డేటాలో సండ్ర ఎవ‌రెవ‌రితో మాట్లాడారో పోలీసులు విడుద‌ల చేసిన ప‌త్రాలు చెబుతున్నా..సండ్ర మాత్రం.. మౌనాన్నే ఆశ్ర‌యించారు. ఈ రెండు రోజుల ఏసీబీ క‌స్ట‌డీకి స‌వాల‌క్ష అడ్డంకులు ఉన్నాయి. థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌రాద‌ని, న్యాయ‌వాది స‌మ‌క్షంలోనే విచార‌ణ జ‌ర‌పాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. ఇవ‌న్నీ సండ్ర‌కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశాలే! ఈసారైనా సండ్ర నుంచి స‌మాధానాలు రాబ‌ట్ట‌డంలో పోలీసులు ఎంత‌మేర స‌ఫ‌లీకృత‌మ‌వుతారో వేచిచూడాలి మ‌రి!
Tags:    
Advertisement

Similar News