అన్నం పెట్టిన పూజారులకు రూ.7.5లక్షల జరిమానా
దేవాలయ నిబంధనలను తోసిపుచ్చి ప్రభుత్వ అధికారులకు భోజనం పెట్టిన ఇద్దరు పూజారులకు దేవస్థాన యాజమాన్య కమిటీ రూ.7.5 లక్షల జరిమానా విధించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటు చేసుకుంది. ఇటీవల బంకే బీహారీ దేవస్థానాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్‌తోపాటు మరో 74 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఆనంద్ కిశోర్ గోస్వామి, జుగల్ కిశోర్ గోస్వాములు వారికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అయితే వారిద్దరూ […]
Advertisement
దేవాలయ నిబంధనలను తోసిపుచ్చి ప్రభుత్వ అధికారులకు భోజనం పెట్టిన ఇద్దరు పూజారులకు దేవస్థాన యాజమాన్య కమిటీ రూ.7.5 లక్షల జరిమానా విధించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటు చేసుకుంది. ఇటీవల బంకే బీహారీ దేవస్థానాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్‌తోపాటు మరో 74 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఆనంద్ కిశోర్ గోస్వామి, జుగల్ కిశోర్ గోస్వాములు వారికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అయితే వారిద్దరూ ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ సహా 74 మంది అధికారులకు ఆలయ ప్రాంగణంలోనే భోజనం వడ్డించారు. దీనిపై దేవస్థాన యాజమాన్య కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన పూజారులు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో దేవస్థానంలో లభించే వసతులు తొలగించడంతోపాటు దేవస్థాన కమిటీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తామని కమిటీ అధ్యక్షుడు నందకిశోర్ ఉపమన్యు హెచ్చరించారు.
Advertisement