దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు
ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకున్న రెవిన్యూ సిబ్బంది అక్కడకు వెళ్ళి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన మనుషులు మాఫియా గూండాల్లా రెవిన్యూ సిబ్బందిపై దాడి చేసిన సంఘటనలో టీడీపీ నేత, దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై చింతమనేని ఆయన అనుచరులతో కలిసి దాడి చేసిన సంగతి తెలిసిందే. తహశీల్దార్‌తోపాటు ఆమె వెంట వచ్చిన […]
Advertisement
ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకున్న రెవిన్యూ సిబ్బంది అక్కడకు వెళ్ళి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన మనుషులు మాఫియా గూండాల్లా రెవిన్యూ సిబ్బందిపై దాడి చేసిన సంఘటనలో టీడీపీ నేత, దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై చింతమనేని ఆయన అనుచరులతో కలిసి దాడి చేసిన సంగతి తెలిసిందే. తహశీల్దార్‌తోపాటు ఆమె వెంట వచ్చిన రెవెన్యూ సిబ్బందిపైనా చింతమనేని అనుచరులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై తహశీల్దార్ వనజాక్షి ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేనిపై పోలీసులు ఐపీసీ 353, 334, 379 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తహశీల్దార్ పై కేసు పెట్టిన ఎమ్మెల్యే వర్గీయులు
ముసునూరు మండలం రంగంపేటలో తహశీల్దార్ వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి ఘటన కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు కాగా దీనికి ప్రతీకారంగా తాజాగా తహశీల్దార్‌పై కౌంటర్ కేసు నమోదైంది. నిబంధనలకు లోబడే ఇసుక తరలిస్తున్న తమపై తహశీల్దార్ వనజాక్షి తన సిబ్బందితో కలిసి అకారణంగా దాడి చేశారని డ్వాక్రా మహిళలు పెదవేగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పెదవేగి పోలీసులు వనజాక్షిపై కూడా కేసు నమోదు చేశారు. మరో వైపు అదే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కేసును వాపస్ తీసుకోవాలని తహశీల్దార్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
అసలేం జరిగింది…
ఇసుక మాఫీయా బరితెగింపుకు ముసునూరు తహసిల్దారు వనజాక్షి, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ ఇతర ప్రభుత్వ సిబ్బందిపై దాడులకు దిగడం పరాకాష్ట. నదీ తీర ప్రాంతంలో ఇసుక మాఫీయా బుసలు కొడుతుందన్నది నగ్న సత్యం. దీనికి ప్రభుత్వంలోని పెద్దలే కొమ్ముకాస్తున్నారన్నది తిరుగులేని నిజం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే కృష్ణా జిల్లా రంగంపేటలో ఇసుక అక్రమ రవాణా సంఘటనలో ఎమ్మెల్యే, ఆయన గూండాల అరాచక దాడి. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలుసుకున్న రెవిన్యూ సిబ్బంది అక్కడకు వెళ్ళి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ప్రభుత్వ విప్ చింతమనేనితోపాటు ఆయన మనుషులు గూండాల్లా రెవిన్యూ సిబ్బందిపై దాడి చేశారు. ఈ సంఘటనలో తహసిల్దారు వనజాక్షి, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇతర సిబ్బంది కూడా గాయపడ్డారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే తమపై ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడి చేశారని, తమ మనుషులను అడ్డుకుంటే భవిష్యత్‌లో కూడా ఇలాగే జరుగుతుందని హెచ్చరించారని ముసునూరు తాహసిల్దారు వనజాక్షి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం దగ్గరికి చేరుకున్నప్పుడు వారి మీద కూడా ఎమ్మెల్యే అనుచరులు దురుసుగా ప్రవర్తించారని వనజాక్షి చెప్పారు. వారిని కూడా ఎమ్మెల్యే చింతమనేని బెదిరించారని ఆమె అన్నారు. కాగా వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని దాడి విషయం తనకు తెలియదని, విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పీతల సుజాత అన్నారు. వనజాక్షి మహిళా అధికారి అని కూడా చూడకుండా దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ డిమాండు చేశారు. ప్రభుత్వంలోని పెద్దలే ఇలా మాఫియాలను వెంటేసుకుని అధికారులపై దాడులు చేస్తుంటే ప్రజాస్వామ్యం ఎలా బతికి బట్టకడుతుందని ఆయన ప్రశ్నించారు.
Advertisement