జిమ్మీ కోసం ఏపీ పోలీసుశాఖకు లేఖ!
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ వేగం పెంచింది. చార్జిషీటు దఖలుకు సమయం దగ్గరపడుతుండటంతో జిమ్మీబాబు కోసం వేట తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. ఈనెల6న విచారణకు జిమ్మీబాబు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని అరెస్టును చేసిన రోజు జిమ్మీబాబు ఏపీకి పారిపోయాడు. అక్కడ విజయవాడ, గుంటూరులో తలదాచుకున్నాడు. రేవంత్‌కు బెయిల్ రాగానే..తిరిగి హైదరాబాద్ వచ్చి ర్యాలీలో పాల్గొన్నాడు. అయితే ఈసారి తెలంగాణ ఏసీబీ కాస్త ముందు జాగ్రత్తగా వ్యవహరించనుంది. ఈ కేసులో ఎ-4నిందితుడు […]
Advertisement
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ వేగం పెంచింది. చార్జిషీటు దఖలుకు సమయం దగ్గరపడుతుండటంతో జిమ్మీబాబు కోసం వేట తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. ఈనెల6న విచారణకు జిమ్మీబాబు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని అరెస్టును చేసిన రోజు జిమ్మీబాబు ఏపీకి పారిపోయాడు. అక్కడ విజయవాడ, గుంటూరులో తలదాచుకున్నాడు. రేవంత్‌కు బెయిల్ రాగానే..తిరిగి హైదరాబాద్ వచ్చి ర్యాలీలో పాల్గొన్నాడు. అయితే ఈసారి తెలంగాణ ఏసీబీ కాస్త ముందు జాగ్రత్తగా వ్యవహరించనుంది. ఈ కేసులో ఎ-4నిందితుడు మత్తయ్య విషయంలో జరిగిన పొరపాట్లు జిమ్మీవిషయంలో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఏపీ పోలీసు శాఖకు జిమ్మీబాబును అప్పగించాలని అధికారకంగా లేఖ రాయాలని నిర్ణయించింది. రేవంత్ అరెస్టయ్యాక మత్తయ్య కోసం గాలిస్తుండగా అతడు విజయవాడ వెళ్లి కేసీఆర్ పై ఫిర్యాదు చేయగానే వారు ఆఘమేఘాల మీద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే! ఈ విషయంలో విజయవాడ సీపీ వెంకటేశ్వర రావు మత్తయ్య నిందితుడన్న విషయం తమకు అధికారికంగా తెలియదని అమాయకపు మాటలు విని సీనియర్ పోలీసు అధికారులు, మీడియా వర్గాలు నవ్వుకున్నారు. అందుకే ఈ సారి ఏపీ పోలీసులకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందే లేఖరాయాలని నిర్ణయించారు. ఇప్పటికే జిమ్మీ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు మొదలు పెట్టినట్లు సమాచారం. ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని దీమా వ్యక్తం చేస్తున్నారు.
Advertisement