తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన నేత వై.ఎస్ ... ఘన నివాళి
తెలుగు ప్రజల గుండెల్లో కొలువై ఉన్న నేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతలు కొనియాడారు. వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద వై.ఎస్. కుటుంబసభ్యులు ఘన నివాళి అర్పించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి, ఆయన భార్య భారతి, కుమార్తె […]
Advertisement
తెలుగు ప్రజల గుండెల్లో కొలువై ఉన్న నేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతలు కొనియాడారు. వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద వై.ఎస్. కుటుంబసభ్యులు ఘన నివాళి అర్పించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి, ఆయన భార్య భారతి, కుమార్తె షర్మిల అల్లుడు బ్రదర్ అనిల్, ఇతర కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాదిమంది వై.ఎస్. అభిమానులు కూడా దివంగత నేత వై.ఎస్.కు ఘన నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. చెదిరిపోని గుండె బలం… నాయకత్వానికి నిలువెత్తు ప్రతిరూపం వై.ఎస్. అని నేతలు కొనియాడారు. మేరునగ ధీరుడు వై.ఎస్. రాజశేఖరుడు అని ప్రశంసించారు. ఎందరో అసాధ్యమనుకున్న పథకాలను సుసాధ్యం చేసిన ఘనత వై.ఎస్.దేనని వారన్నారు. తెలుగు రాజకీయ యవనికపై తిరుగులేని నాయకుడుగా సుస్థిర స్థానం సంపాదించుకున్న వై.ఎస్. ను జనం ఎన్నటికీ మరిచిపోలేరని వై.ఎస్. జగన్ అన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కృషి మరువలేదన్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్.చేసిన సేవలు మరువలేమని, దేశంలో ఎవరూ అమలుచేయని సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారని అనంతపురంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి, గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి అన్నారు. వై.ఎస్. జయంతి వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఆయనకు ఘన నివాళి అర్పించారు.
ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క వై.ఎస్.కు మాత్రమే దక్కుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతూ వై.ఎస్. స్ఫూర్తితోనే తెలంగాణలో అధికారం దక్కించుకుంటామని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు.
Advertisement