సనత్‌నగర్ నుంచి పవన్‌కల్యాణ్ పోటీ ?
హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో జనసేన జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారట. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆయన స్వయంగా బరిలోకి దిగబోతున్నారట. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరగబోయే ఎన్నికల్లో కూడా జనసేన తరపున కొన్ని కార్పొరేటర్ సీట్లలో అభ్యర్థులను నిలపాలని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారట. సనత్‌నగర్‌లో పోటీ చేస్తే గెలుపు ఖాయమని పవన్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో […]
Advertisement
హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో జనసేన
జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారట. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆయన స్వయంగా బరిలోకి దిగబోతున్నారట. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరగబోయే ఎన్నికల్లో కూడా జనసేన తరపున కొన్ని కార్పొరేటర్ సీట్లలో అభ్యర్థులను నిలపాలని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారట. సనత్‌నగర్‌లో పోటీ చేస్తే గెలుపు ఖాయమని పవన్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పవన్ కల్యాణ్ ప్రత్యేకించి సనత్‌నగర్‌ను ప్రస్తావించిన సంగతి తెల్సిందే. సనత్‌నగర్‌లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన శ్రీనివాస యాదవ్ ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరడం, మంత్రి పదవి చేపట్టడం తెలిసిన విషయాలే. ఇప్పుడుడు అక్కడ ఉప ఎన్నిక వస్తే టీఆర్ఎస్ తరపున ఆయనే అభ్యర్థి అవుతారు. సనత్‌నగర్ ఒకప్పుడు మర్రి శశిధర్ రెడ్డి కి కంచుకోట వంటి స్థానం. అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు బలమైన స్థానం. అయితే 2014లో అక్కడ తెలుగుదేశం గెలవడానికి పవన్ కల్యాణ్ ప్రచారం కూడా ఒక కారణం. నిజానికి తాను ఎన్నికల బరిలో నిలవాల్సి వస్తే సనత్‌నగర్ నే ఎంచుకోవాలని పవన్‌కల్యాణ్ కూడా భావించారట. అనేక సర్వేలు చేయించుకుని ఆయన ఆ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే 2014లో ఆయనేకాదు జనసేన తరపున రెండు రాష్ర్టాలలోనూ ఎక్కడా అభ్యర్థులను నిలపలేదు. నిలబడే పరిస్థితి వస్తే సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, లేదా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం తనకు మేలని పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలకు ముందే ఒక అంచనాకు వచ్చారని సమాచారం. విలేకరుల సమావేశంలో సనత్‌నగర్‌ను ప్రస్తావించడం ద్వారా తాను ఆ స్థానాన్ని కోరుకుంటున్నట్లు ఆయన తెలుగుదేశం, బీజేపీ పక్షాలకు పరోక్ష సంకేతాలు పంపించారు. ఒకవైపు కేసీఆర్‌ను పొగుడుతూనే హరీష్ వంటి వారిని పవన్ గట్టిగా నిలదీశారు. ఆంధ్రోళ్లు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదని సీమాంధ్ర ఎంపీలను తిట్టిపోశారు. కేసీఆర్‌ను పొగడడం ద్వారా తెలంగాణ ఓటర్లను ఆకర్షిస్తూనే హరీష్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఓటర్లను బుట్టలో వేయడానికి పవన్ గట్టిగానే ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఆ విలేకరుల సమావేశం… హైదరాబాద్ కార్పొరేషన్‌లో 50 నుంచి 60 స్థానాలలో జనసేన పోటీ చేయాలని భావిస్తున్నట్లు పవన్ సన్నిహితులు చెబుతున్నారు. తెలుగుదేశం – బీజేపీ పొత్తుతో జనసేన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలుస్తుందని వారు పేర్కొంటున్నారు.
Advertisement