జాతీయ కనీస వేతనం రూ. 160
వేతన జీవుల జాతీయ కనీస వేతనాన్నిరూ. 160గా కేంద్రం నిర్ధారించింది. ఇప్పటి వరకూ రూ. 137 ఉన్న జాతీయ కనీస వేతనాన్ని రూ.160లకు పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెంచిన వేతనాన్ని జూలై 1నుంచి అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జాతీయ కనీస వేతనం పెంపుపై అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశామని ఆయన చెప్పారు. ఔట్ సోర్సింగ్‌తో సహా అన్ని ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ వేతనం […]
Advertisement
వేతన జీవుల జాతీయ కనీస వేతనాన్నిరూ. 160గా కేంద్రం నిర్ధారించింది. ఇప్పటి వరకూ రూ. 137 ఉన్న జాతీయ కనీస వేతనాన్ని రూ.160లకు పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెంచిన వేతనాన్ని జూలై 1నుంచి అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జాతీయ కనీస వేతనం పెంపుపై అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశామని ఆయన చెప్పారు. ఔట్ సోర్సింగ్‌తో సహా అన్ని ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ వేతనం వర్తిస్తుందని ఆయన తెలిపారు. 2013 తర్వాత జాతీయ కనీస వేతనాన్ని ఎన్డీఏ ప్రభుత్వమే సవరించిందని, వినియోగదారుల ఇండెక్స్ సూచి ఆధారంగా ఈ సవరణ జరిగిందని దత్తాత్రేయ చెప్పారు.
Advertisement