రాణీ దుర్గావతిని ప్రారంభించిన తూర్పు నౌకాదళాధిపతి
భారతదేశ తీరప్రాంతానికి అనుక్షణం గస్తీ కాసే తీరరక్షకదళం (కోస్ట్‌గార్డు)కు మరో కొత్త సముద్ర తీర గస్తీ నౌక అందుబాటులోకొచ్చింది. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) రూపొందించిన ఈ నౌకను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ నౌకకు గోండు వంశానికి చెందిన వీరనారి రాణి దుర్గావతి పేరు పెట్టామని ఆయన తెలిపారు. 51 మీటర్ల పొడవుగల ఈ నౌకలో అత్యాధునిక దిశానిర్దేశక, కమ్యూనికేషన్ సెన్సర్లు, పరికరాలున్నాయని ఆయన అన్నారు. రాణీ దుర్గావతికి […]
Advertisement
భారతదేశ తీరప్రాంతానికి అనుక్షణం గస్తీ కాసే తీరరక్షకదళం (కోస్ట్‌గార్డు)కు మరో కొత్త సముద్ర తీర గస్తీ నౌక అందుబాటులోకొచ్చింది. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) రూపొందించిన ఈ నౌకను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ నౌకకు గోండు వంశానికి చెందిన వీరనారి రాణి దుర్గావతి పేరు పెట్టామని ఆయన తెలిపారు. 51 మీటర్ల పొడవుగల ఈ నౌకలో అత్యాధునిక దిశానిర్దేశక, కమ్యూనికేషన్ సెన్సర్లు, పరికరాలున్నాయని ఆయన అన్నారు. రాణీ దుర్గావతికి గంటకు సుమారు 14 నుంచి 34 నాటికల్ మైళ్లు ప్రయాణిచే సామర్థ్యముంది. ఈ నౌక లోపలి నుంచే శత్రువులపై కాల్పులు జరిపే కంట్రోలింగ్ సిస్టమ్ ఉందని, ఈనౌకకు కమాండెంట్‌గా ఎస్. జాకిర్ హుస్సేన్ వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.
Advertisement