స్టీల్ ఉత్పత్తిలో మూడో స్థానానికి చేరిన భారత్
స్టీలు ఉత్పత్తిలో ఈ ఏడాది తొలి అర్థభాగంలోనే భారత్ మూడో స్థానానికి చేరి అంతర్జాతీయ స్టీలు మార్కెట్‌లో తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. గతేడాది చైనా, రష్యా, అమెరికాల తర్వాత నాలుగో స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే ఈ ఘనత సాధించిందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. 2025 నాటికి మన దేశంలో స్టీల్ ఉత్పత్తిని 30 కోట్ల టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన […]
Advertisement
స్టీలు ఉత్పత్తిలో ఈ ఏడాది తొలి అర్థభాగంలోనే భారత్ మూడో స్థానానికి చేరి అంతర్జాతీయ స్టీలు మార్కెట్‌లో తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. గతేడాది చైనా, రష్యా, అమెరికాల తర్వాత నాలుగో స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే ఈ ఘనత సాధించిందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. 2025 నాటికి మన దేశంలో స్టీల్ ఉత్పత్తిని 30 కోట్ల టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో స్టీలు వినియోగం తక్కువగా ఉండడం వలన భవిష్యత్‌లో మన ఉత్పత్తి మరింత పెరిగే అవకాశముందని ఆయన అన్నారు.
Advertisement