మ‌నం ఇప్ప‌టికీ బ్రిటీష్ ప్ర‌భువుల‌ను కీర్తిస్తున్నామా?

జ‌న‌గ‌ణ‌మ‌న అధినాయ‌క జ‌య‌హే భార‌త భాగ్య విధాత-అంటూ మ‌నం నిత్యం పాడే జాతీయ గీతంలో అధినాయ‌క అంటే ఎవ‌రు? నిస్సందేహంగా అల‌నాటి తెల్ల‌దొర‌లేనంటున్నారు రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్ క‌ళ్యాణ్‌సింగ్‌. స్వ‌తంత్ర భార‌త దేశంలో బ్రిటీష్ పాల‌కులను కీర్తించాల్సిన‌ ఖ‌ర్మ ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. త‌క్ష‌ణం జాతీయ గీతం నుంచి అధినాయ‌క అనే ప‌దాన్నినిషేధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ర‌వీంద్రుడు జ‌న‌గ‌ణ‌మ‌ణ రాసినప్పుడు అధినాయ‌క అన్న ప‌దాన్నిబ్రిటీష్‌వారినుద్దేశించే రాశారంటున్నారు క‌ళ్యాణ్‌సింగ్‌. జాతీయ గీతంలోని అధినాయ‌క‌ ప‌దం స్థానంలో మ‌హామ‌హిమ్ అనే మాటను వాడ‌వ‌చ్చ‌ని కూడా సూచిస్తున్నారు. […]

Advertisement
Update:2015-07-07 18:38 IST

జ‌న‌గ‌ణ‌మ‌న అధినాయ‌క జ‌య‌హే భార‌త భాగ్య విధాత-అంటూ మ‌నం నిత్యం పాడే జాతీయ గీతంలో అధినాయ‌క అంటే ఎవ‌రు? నిస్సందేహంగా అల‌నాటి తెల్ల‌దొర‌లేనంటున్నారు రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్ క‌ళ్యాణ్‌సింగ్‌. స్వ‌తంత్ర భార‌త దేశంలో బ్రిటీష్ పాల‌కులను కీర్తించాల్సిన‌ ఖ‌ర్మ ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. త‌క్ష‌ణం జాతీయ గీతం నుంచి అధినాయ‌క అనే ప‌దాన్నినిషేధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ర‌వీంద్రుడు జ‌న‌గ‌ణ‌మ‌ణ రాసినప్పుడు అధినాయ‌క అన్న ప‌దాన్నిబ్రిటీష్‌వారినుద్దేశించే రాశారంటున్నారు క‌ళ్యాణ్‌సింగ్‌. జాతీయ గీతంలోని అధినాయ‌క‌ ప‌దం స్థానంలో మ‌హామ‌హిమ్ అనే మాటను వాడ‌వ‌చ్చ‌ని కూడా సూచిస్తున్నారు.

సుబ్ర‌మ‌ణ్య‌స్వామి మ‌ద్ద‌తు
అధినాయ‌క ప‌దం నియంతృత్వానికి చిహ్న‌మంటున్నారు బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి. జాతీయ గీతం నుంచి అధినాయ‌క ప‌దాన్నితొల‌గించాల‌న్న‌రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్ డిమాండుకు స్వామి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇది ఎన్నోఏళ్ల క్రిత‌మే చేసివుండాలంటున్నారు.

Tags:    
Advertisement

Similar News