యేటా కాంగ్రెస్ కార్య‌క‌ర్త నుంచి రూ. 250 వ‌సూలు?

ఆర్థిక పరిపుష్టి సాధించడంపై జాతీయ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల నుంచే ఈ క్ర‌తువుకు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పార్టీ కార్యకర్తల నుంచి ప్రతీ సంవత్సరం రూ. 250 వసూలు చేయాలని భావిస్తున్నట్లు ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా తెలిపారు. ఈ అంశమై మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం పార్టీ ఆర్థిక సమస్యల్లో ఉందని, ఈ సమస్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే విరాళాల సేకరణ చేపట్టాలని […]

Advertisement
Update:2015-07-05 18:42 IST
ఆర్థిక పరిపుష్టి సాధించడంపై జాతీయ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల నుంచే ఈ క్ర‌తువుకు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పార్టీ కార్యకర్తల నుంచి ప్రతీ సంవత్సరం రూ. 250 వసూలు చేయాలని భావిస్తున్నట్లు ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా తెలిపారు. ఈ అంశమై మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం పార్టీ ఆర్థిక సమస్యల్లో ఉందని, ఈ సమస్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే విరాళాల సేకరణ చేపట్టాలని భావిస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా వచ్చిన విరాళాల మొత్తంలో 25 శాతం రాష్ర్ట పీసీసీలకు కేటాయించగా, 75 శాతం ఏఐసీసీకి కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పార్టీకి చెందిన ప్రతీ ఎంపీ, ఎమ్మెల్యే సంవత్సరానికి ఒక నెల జీతం పార్టీకి ఫండ్‌గా ఇస్తున్నారని, అదేవిధంగా ఏఐసీసీ సభ్యులు ఏటా రూ.600, రాష్ర్టాల పీసీసీ సభ్యులు రూ.300 ఇస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రస్తుత నిర్ణయం ప్రకారం.. రాష్ర్ట యూనిట్ పరిధిలో వచ్చిన విరాళాల్లో 50 శాతం నిధులను జిల్లా యూనిట్‌కు ఇవ్వనున్నట్లు చెప్పారు.
Tags:    
Advertisement

Similar News