ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర అరెస్ట్‌

ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అవినీతి నిరోధక శాఖ (టీ-ఏసీబీ) అరెస్ట్‌ చేసింది. సోమవారం ఉదయం ఏసీబీ విచారణకు వచ్చిన సండ్రను ఉదయం పదిన్నర గంటల నుంచి ప్రశ్నిస్తూనే ఉంది. విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోవడంతో సండ్రను ఏసీబీ అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన తర్వాత సండ్రకు కూడా జూన్‌ 16న నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఆరోగ్య […]

Advertisement
Update:2015-07-06 14:00 IST

ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అవినీతి నిరోధక శాఖ (టీ-ఏసీబీ) అరెస్ట్‌ చేసింది. సోమవారం ఉదయం ఏసీబీ విచారణకు వచ్చిన సండ్రను ఉదయం పదిన్నర గంటల నుంచి ప్రశ్నిస్తూనే ఉంది. విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోవడంతో సండ్రను ఏసీబీ అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన తర్వాత సండ్రకు కూడా జూన్‌ 16న నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా తాను విచారణకు హాజరుకాలేనని, తనకు పది రోజుల సమయం కావాలని లిఖితపూర్వకంగా అభ్యర్థించారు. పది రోజులు అయిపోయిన తర్వాత ఆయన మరోసారి లేఖ రాస్తూ తనకు ఆరోగ్యం కుదుట పడిందని, ఎప్పుడు పిలిచినా వస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆయనకు మరోసారి ఏసీబీ మరోసారి నోటిసు ఇచ్చింది. ఈనేపథ్యంలో సోమవారం ఆయన ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.
గతనెల 30, 31 తేదీల్లో రేవంత్‌రెడ్డితో సండ్ర ఫోన్‌లో మాట్లాడినట్టు ఏసీబీ ఐజీ తెలిపారు. అలాగే ఈ కేసులో మరో నిందితుడు మత్తయ్యకు ఎనిమిది సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు ఏసీబీ గుర్తించింది. ఈకేసులో సండ్ర ఫోన్‌ సంభాషణల ఆధారంగా ఏసీబీ విచారణ సాగింది. ఎంతమంది ఎమ్మెల్యేలను కొనడానికి ప్లాన్‌ చేశారు? టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చారు. అంత పెద్ద మొత్తం ఎవరు సమకూర్చారు… వంటి ప్రశ్నలు ఏసీబీ సండ్రకు సంధించగా ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. ఏసీబీ విచారణలో ఆయన సహకరించలేదని చెబుతున్నారు. దీన్ని పురస్కరించుకుని ఏసీబీ ఆయన్ని మరింత వివరంగా విచారణ చేయడానికి ఇపుడు అరెస్ట్‌ చేసిందని తెలిసింది.

Tags:    
Advertisement

Similar News