తెలంగాణ జిల్లాల్లో కేసీఆర్ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ జిల్లాలో హరితం హారం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి కె చంద్రశేఖర‌రావు సుడిగాలి పర్యటనలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటనలు జరిపారు. హెలికాప్టర్‌లో పర్యటించి హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో హరితహారం ప్రారంభించారు. ధర్మారం, వెల్గటూరులో హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. మూడు టీఎంసీల సామర్థ్యం గల ఈ పథకాన్ని రూ.125 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన […]

Advertisement
Update:2015-07-05 18:36 IST

తెలంగాణ జిల్లాలో హరితం హారం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి కె చంద్రశేఖర‌రావు సుడిగాలి పర్యటనలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటనలు జరిపారు. హెలికాప్టర్‌లో పర్యటించి హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో హరితహారం ప్రారంభించారు. ధర్మారం, వెల్గటూరులో హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. మూడు టీఎంసీల సామర్థ్యం గల ఈ పథకాన్ని రూ.125 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ధర్మపురిలోఈనెల 14 వ తేదీన గోదావరి పుష్కరాల్లో స్వయంగా పాల్గొని మొక్కులు తీరుస్తానని అన్నారు. ఈసారి కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఖాయమని దర్మారం సభలో భరోసా ఇచ్చారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పడకల సంఖ్య పెంచుతామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వాటర్ గ్రిడ్ ద్వారా మంచి నీళ్ళు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని అన్నారు.

Tags:    
Advertisement

Similar News