ఇంటిలిజెన్స్ ఐజీ అనురాధపై బదిలీ వేటు
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ బదిలీలు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధను దృష్టిలో పెట్టుకునే చేసినట్టు కనిపిస్తోంది. ఏపీలో ముఖ్యమైన వ్యక్తుల ఫోన్‌లు ట్యాపింగ్ జరుగుతున్నా తెలుసుకోలేక పోయారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహానికి గురైన ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఎ.ఆర్. అనురాధను ఆ స్థానం నుంచి బదిలీ చేశారు. రెండు వారాల కిందట కేబినెట్ భేటీలో అనురాధపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ సమయంలో ఆమె కూడా తీవ్రంగానే స్పందించారని వార్తలు […]
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ బదిలీలు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధను దృష్టిలో పెట్టుకునే చేసినట్టు కనిపిస్తోంది. ఏపీలో ముఖ్యమైన వ్యక్తుల ఫోన్‌లు ట్యాపింగ్ జరుగుతున్నా తెలుసుకోలేక పోయారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహానికి గురైన ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఎ.ఆర్. అనురాధను ఆ స్థానం నుంచి బదిలీ చేశారు. రెండు వారాల కిందట కేబినెట్ భేటీలో అనురాధపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ సమయంలో ఆమె కూడా తీవ్రంగానే స్పందించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్పుడే ఆమెకు స్థాన చలనం తప్పదని భావించారు. అయితే అప్పటికప్పుడు అనురాధను బదిలీ చేస్తే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే కారణంతో నెమ్మదించిన ఏపీ ప్రభుత్వం ఇపుడు ఆ పని కాస్తా ముగించింది ఆమె స్థానంలో ప్రస్తుతం విజయవాడ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావును నియమించారు. విజయవాడ పోలీస్ కమిషనర్‌గా గౌతం సవాంగ్‌ను నియమించారు. ఇప్పటివరకు ఇంటిలిజెన్స్ విభాగం చీఫ్‌గా ఉన్న ఎ.ఆర్. అనురాధను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమించారు. ఈ ముగ్గురి నియామకాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు జపాన్ పర్యటనలో ఉన్పప్పుడు జరగడం విశేషం.