వారసత్వ హోదా దక్కించుకున్న19 కళాశాలలు
వంద సంవత్సరాలకు పైబడి విద్యనందిస్తున్న 19 పురాతన కళాశాలలకు యూజీసీ వారసత్వ హోదాను ప్రకటించింది. శతాబ్దాల క్రిత నిర్మించిన పురాతన విద్యాసంస్థలను రక్షించే లక్ష్యంతో యూజీసీ ప్రకటించిన హెరిటేజ్ కాలేజ్ స్కీం కోసం దేశవ్యాప్తంగా 60 పురాతన విద్యాసంస్థలు దరఖాస్తులు పంపాయి. అయితే వాటిలో 19 విద్యాసంస్థలు మాత్రమే హెరిటేజ్ ట్యాగ్ లైన్‌కు ఎంపికయ్యాయి. ఎంపికైన ఈ 19 విద్యా సంస్థల అభివృద్ధికి యూజీసీ నిధులు కేటాయించనుంది. వారసత్వ భవన పరిరక్షణ కింద కాటన్ కాలేజ్ ఆప్ […]
Advertisement
వంద సంవత్సరాలకు పైబడి విద్యనందిస్తున్న 19 పురాతన కళాశాలలకు యూజీసీ వారసత్వ హోదాను ప్రకటించింది. శతాబ్దాల క్రిత నిర్మించిన పురాతన విద్యాసంస్థలను రక్షించే లక్ష్యంతో యూజీసీ ప్రకటించిన హెరిటేజ్ కాలేజ్ స్కీం కోసం దేశవ్యాప్తంగా 60 పురాతన విద్యాసంస్థలు దరఖాస్తులు పంపాయి. అయితే వాటిలో 19 విద్యాసంస్థలు మాత్రమే హెరిటేజ్ ట్యాగ్ లైన్‌కు ఎంపికయ్యాయి. ఎంపికైన ఈ 19 విద్యా సంస్థల అభివృద్ధికి యూజీసీ నిధులు కేటాయించనుంది. వారసత్వ భవన పరిరక్షణ కింద కాటన్ కాలేజ్ ఆప్ గౌహతికి అత్యధికంగా రూ. 4.35 కోట్లను యూజీసీ కేటాయించింది. హెరిటేజ్ ట్యాగ్ లైన్ కోసం దేశ రాజధాని ఢిల్లీ విద్యాసంస్థలు ఒక్క ప్రతిపాదన కూడా పంపక పోగా, తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క కళాశాలకు కూడా ఈ హోదా దక్కక పోవడం విశేషం.
Advertisement